NTR : ఎన్టీఆర్, నాగవంశీ ఏది నిజం..?

Update: 2025-04-05 06:01 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ లో చాలా ఉత్సాహంగా కనిపించాడు. అందరినీ పేరు పేరునా అభినందించాడు. ఓ రకంగా ఇది బెస్ట్ క్వాలిటీ అని చెప్పాలి. నిజానికి చాలామంది ఇది తన బావమరిది (నార్నే నితిన్ ) సినిమా కాబట్టి వచ్చాడు అనుకున్నారు. బట్ సితార, హారిక హాసిని బ్యానర్ తో ఎన్టీఆర్ కు ఉన్న అనుబంధం అంతకు మించి ఉంటుంది. అయితే నార్నే నితిన్ ను మాత్రమే కాదు.. సంతోష్ శోభన్, రామ్ నితిన్, విష్ణు, మురళీధర్ గౌడ్ ఇలా ప్రతి ఒక్కరినీ పేరు పేరునా మెచ్చుకున్నాడు. సునిల్ ను మరోసారి పొగడ్తలతో ముంచెత్తాడు. అయితే ఇదే వేదికపై నుంచి రెండు పెద్ద అనౌన్స్ మెంట్స్ చేశాడు ఎన్టీఆర్.

ఇందులో దేవర 2 ఉంటుందని. ఈ మూవీ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ వల్ల ఆలస్యం అయింది తప్ప ఆగలేదు.. ఖచ్చితంగా ఉంటుందని తేల్చాడు. అలాగే నాగవంశీతో చేయబోయే సినిమా గురించి చెప్పాడు. ఆ విషయం వంశీయే చెబుతాడు అని కూడా అన్నాడు. కొన్ని రోజుల క్రితం ఇదే మ్యాడ్ స్క్వేర్ ప్రెస్ మీట్ లో నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే.. ‘హీరో దొరికినప్పుడు’ అని సమాధానం చెప్పాడు నాగవంశీ. అంటే ఎన్టీఆర్ కాదు అని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. అదే టైమ్ లో తనూ, నెల్సన్ సినిమా చేస్తాం కానీ హీరో ఇంకా దొరకలేదు అని చెప్పడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఇప్పుడు ఎన్టీఆరే స్వయంగా నాగవంశీతో సినిమా గురించి చెప్పడం.. దీని ప్రకటన కూడా అతనే చేస్తాడు అనడం.. ఒక్కసారి కమిట్ అయిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ నాగవంశీయే ఫేస్ చేస్తాడు అనడం.. ఇవన్నీ వేదికపై వినోదంగా ఉన్నా.. ఈ కాంబోలో సినిమా కన్ఫార్మ్ అన్న విషయాన్ని చెప్పాయి. మరి ఎన్టీఆర్, నాగవంశీ, నెల్సన్ కాకుండా మరో దర్శకుడేమైనా ఎంటర్ అవుతాడా అనేది చూడాలి. 

Tags:    

Similar News