Nagavamsi : విజయ్ ఫ్యాన్స్ కు నాగవంశీ షాక్

Update: 2025-07-05 07:15 GMT

ప్రొడ్యూసర్ నాగవంశీ ఏం చేసినా కొంత ఆశ్చర్యంగానే ఉంటుంది. ఊహించనివి వదులుతుంటాడు అప్పుడప్పుడు. తన బ్యానర్ లో వస్తోన్న సినిమాలన్నీ ఈ మధ్య సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. కంటెంట్ బలంగా ఉంటేనే ప్రొడక్షన్ లోకి దిగుతున్నాడు. ప్రస్తుతం ఈ బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా కింగ్ డమ్ రూపొందుతోంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని మే 30న విడుదల చేస్తాం అని ప్రకటించారు. తర్వాత జూలై 4కు పోస్ట్ పోన్ చేశారు. ఆ డేట్ కూడా పోయింది. దీంతో కొత్త డేట్ గా జూలై 25 ఉంటుందనుకున్నారు. బట్ ఆ ముందు రోజే హరిహర వీరమల్లు అనౌన్స్ చేశారు. సో.. పవన్ తో పోటీకి వెళ్లరు కాబట్టి ఈ నెలలో కింగ్ డమ్ ఉండదు. అయినా ఫ్యాన్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం నాగవంశీపై సోషల్ మీడియాలో ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఈ రోజు(శనివారం) కొత్త అప్డేట్ చెబుతా అంటూ ఊరించాడు. దీంతో అందరూ ఇది కింగ్ డమ్ గురించిన అప్డేట్ అనుకున్నారు. బట్.. అలా అనుకున్న వాళ్లందరికీ షాక్ ఇస్తూ మరో వీడియో విడుదల చేశాడు నాగవంశీ.

తాజాగా తను చెప్పిన టైమ్ కు ఒక వీడియో విడుదల చేశాడు. అయితే ఇది కింగ్ డమ్ గురించి కాదు.. ఎన్టీఆర్ గురించి. యస్.. ఎన్టీఆర్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ వార్ 2 ను తను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఈ వీడియో రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ తో తమకు అరవింద సమేత తో మంచి విజయం వచ్చిందని.. తర్వాత దేవర డిస్ట్రిబ్యూషన్ తో లాభాలు వచ్చాయని.. ఇప్పుడు వార్ 2 తో ఆ అసోసియేషన్ కంటిన్యూ అవుతుందంటూ.. ఈ వీడియో రూపొందించారు. ఇందుకోసం వార్ 2 విజువల్స్ ను కూడా వాడుకున్నారు. అది బావుంది. సో.. అలా కింగ్ డమ్ గురించి అనుకుంటే వార్ 2 తో తనదైన శైలిలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు నాగవంశీ.

Tags:    

Similar News