మాస్ మహరాజ్ రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన మూవీ మిస్టర్ బచ్చన్. ఈ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. బచ్చన్ తో భాగ్యశ్రీ బోర్సే తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఫస్ట్ మూవీ కావడంతో మాగ్జిమం 'టాలెంట్' ప్రదర్శిస్తోందనే చెప్పాలి. ఓ రకంగా ఈ మూవీ సాంగ్స్ లో భాగ్యశ్రీ మెయిన్ అట్రాక్షన్ గా మారిందనేది నిజం. ఆమెతో మాస్ రాజా రొమాన్స్ కూడా కాస్త శృతి మించి కనిపిస్తోంది. ఈ విషయంలో కొన్ని కమెంట్స్ వచ్చినా ఐ డోంట్ కేర్ అంటున్నాడు దర్శకుడు. మొత్తంగా మిస్టర్ బచ్చన్ నుంచి లేటెస్ట్ గా మరో సాంగ్ విడుదల చేశారు. నల్లంచు తెల్లచీర అబ్బబ్బో అరాచకం అంటూ సాగే ఈ సాంగ్ ఇప్పటి వరకూ వచ్చిన బచ్చన్ పాటల్లో బెస్ట్ అనిపించుకుంటోంది.
మిక్కీ జే మేయర్ తన స్టైల్ కు పూర్తి భిన్నంగా బచ్చన్ సాంగ్స్ ను అందించాడు. మరీ కొత్తవే కాకపోయినా ఎక్కువగా మాస్ బీట్స్ ఉన్నాయి. రవితేజ ఇమేజ్ కు తగ్గ ట్యూన్స్ పడ్డాయి. ఈ విషయంలో మేజర్ క్రెడిట్ దర్శకుడిదే అని చెప్పుకున్నా.. మిక్కీలో ఈ టాలెంట్ ఉందనే విషయం కూడా అర్థం చేసుకోవాలి.
ఇక నల్లంచు తెల్లచీర మాస్ ను ఊపేసే బీట్ లా కనిపిస్తోంది. ఎనర్జిటిక్ స్టెప్పులు కనిపిస్తున్నాయి. ఫ్యాన్స్ తో పాటు జనరల్ మాస్ ఆడియన్స్ కు కూడా కిక్ ఇచ్చేలా ఉందీ పాట. భాస్కరభట్ల రాసిన ఈ గీతాన్ని వ్రీరామ చంద్ర, సమీరా భరద్వాజ్ కలిసి పాడారు. భాస్కరభట్ల పెన్ రవితేజ అంటే స్పెషల్ గా కదులుతుంది. అది ఈ పాటలో మరోసారి కనిపిస్తోంది. మొత్తంగా ఈ సాంగ్ ను రిలీజ్ కు ముందు వరకూ ఆపడం కరెక్టే అని చూశాక తెలుస్తోంది. ఖచ్చితంగా అన్ని వర్గాల ఆడియన్స్ కు ఫేవరెట్ సాంగ్ గా మారే అవకాశం ఉంది.