Namrata Shirodkar: తల్లి ప్రేమ.. కొడుకు వారం రోజులు టూరెళ్తున్నాడని..
Namrata Shirodkar: ఎంతైనా అమ్మకదా.. ఏ ఎమోషన్‌నీ ఆపుకోలేదు.. సంతోషం వచ్చినా, దు:ఖం వచ్చినా తట్టుకోలేదు..;
Namrata Shirodkar: ఎంతైనా అమ్మకదా.. ఏ ఎమోషన్‌నీ ఆపుకోలేదు.. సంతోషం వచ్చినా, దు:ఖం వచ్చినా తట్టుకోలేదు.. తన కనుసన్నల్లో పెరిగిన పిల్లలు పెరిగి పెద్దవాళ్లై ప్రయోజకులైతే సంతోషించే మొదటి వ్యక్తులు అమ్మానాన్నలు.. చదువుల్లో భాగంగా ఒక్కరే ఒక్కోసారి టూర్ వెళ్లాల్సి వస్తుంది. అప్పటి వరకు అమ్మానాన్న తోడు ఉంటారు.. ఇప్పుడు టీచర్ల చేతిలో పిల్లల్ని పెట్టి పంపిస్తారు..
అయినా ఏదో తెలియని దిగులు.. అందరి అమ్మల్లానే ఆమె కూడా ఫీలయింది. కొడుకు గౌతమ్ సైన్స్ టూర్‌కి వెళుతున్నాడని దిగులు చెందింది.. అయినా తమాయించుకుని ఈ టూర్ నీ కెరీర్‌కు ఉపయోగపడుతుందని భావిస్తున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు నటుడు మహేష్ బాబు భార్య నమ్రత. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నమ్రత తమ చిన్నారుల చిన్న చిన్న సరదాలను అభిమానులతో పంచుకుంటారు. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు.
ఆమె ఈ పోస్ట్‌కి టీన్స్ ఇండిపెండెన్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది. అలాగే, తోటి విద్యార్థులతో గౌతమ్ దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు.