Nandamuri Balakrishna: బావగారింట్లో బాలయ్య సంక్రాంతి సంబరాలు..
Nandamuri Balakrishna: బాలయ్య, పురంధేశ్వరి తోబుట్టువులైన లోకేశ్వరి, ఉమామహేశ్వరి కుటుంబాలు కూడా ఇక్కడికే తరలివచ్చాయి.;
Nandamuri Balakrishna: దగ్గుబాటి, నందమూరి కుటుంబాలు భోగి పండుగను కలిపి జరుపుకుంటున్నాయి. ప్రకాశం జిల్లా కారంచేడులో బావ దగ్గుబాటి వెంకటేశ్వర్రావు ఇంటికి వెళ్లిన నందమూరి బాలకృష్ణ దంపతులు అక్కడ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. వీరితోపాటు.. బాలయ్య, పురంధేశ్వరి తోబుట్టువులైన లోకేశ్వరి, ఉమామహేశ్వరి కుటుంబాలు కూడా ఇక్కడికే తరలివచ్చాయి.
బంధుమిత్రుల రాకతో దగ్గుబాటివారి ఇల్లు కళకళలాడుతోంది. మనవళ్లు, మనవరాళ్లతో అక్కడంతా సందడి నెలకొంది. అందరూ కలిసే భోగి మంట వేశారు. ఆ ఫ్యామిలీ పిక్చర్ చూసి గ్రామస్థుల్లో పట్టరాని సంతోషం కనిపించింది.
అటు, బాలయ్య రాక తెలిసి.. ఊళ్లో వాళ్లంతా ఆయన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భారీ బ్యానర్లు కట్టి తమ అభిమానం చాటుకున్నారు. తనను కలిసేందుకు వచ్చిన వారికి అభివాదం చేసి, కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు బాలయ్య.