Nandamuri Balakrishna : జైలర్ 2లో నందమూరి నటసింహం

Update: 2024-12-16 06:15 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ మూవీ ఎంత పెద్ద విజయాన్నీ సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు నెల్సన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 వస్తున్న విషయం తెలిసిందే. తాజగా ఈ సీక్వెల్ గురించి ఒక న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడట. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందట. ఇదే కనుక నిజమైతే ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ అవడం ఖాయం. అసలే బాలయ్యకు మాస్ క్యారెక్టర్స్ వస్తే ఇరగదీస్తాడు. ఇక జైలర్‌-2లో ఊర మాస్ క్యారెక్టర్ ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. అటు సూపర్ స్టార్ రజనీ కాంత్.. ఇటు బాలయ్య కలిస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అంటూ ఇరువురి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. 

Tags:    

Similar News