'90స్ మిడిల్ క్లాస్ బయోపిక్'తో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న యువ హీరో మౌళి తనూజ్.. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'లిటిల్ హార్ట్స్'. ఇందులో మౌళి సరసన శివాని నాగరం హీరోయిన్ గా నటించింది. సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రశాంత్, రాజీవ్ కనకాల, అనిత్, చౌదరి, సత్య కృష్ణన్, కంచి, జై కృష్ణ కీలక పాత్రలో కనిపించారు. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకు పోతుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ యూత్ మనసులతో పాటు సినీ సెలెబ్రిటీలను సైతం మెప్పిస్తోంది. తాజాగా నేచురల్ స్టార్ నాని 'లిటిల్ హార్ట్స్ 'కు ఫిదా అయ్యాడు. 'సినిమా అంతా ఎంత సరదాగా సాగిపోయిందో మాటల్లో చెప్పలేను. చాలాకాలం తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకున్న. అఖిల్, మధు, కాత్యాయని మీరందరూ కలిసి నా రోజును నవ్వులతో పూర్తి చేశారు. మీకు థాంక్స్ తప్ప ఏం చెప్పగలను' అంటూ ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక నాని సినిమాల విషయానికొస్తే.. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న 'ది ప్యారడైజ్ ' ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఎస్ఎల్వీ బ్యానర్పై సుధాకర్ నిర్మిస్తున్న ఈ మూవీ.. వచ్చే ఏడాది మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో రిలీజ్ కానుంది.