నితిన్, వేణు శ్రీరామ్ తాజా కాంబో చిత్రం తమ్ముడు. దిల్ రాజునిర్మాత, లయ కీలక పాత్ర పోషించడంతో మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయితే ఈ సినిమా కథను డైరెక్టర్ వేణు శ్రీరామ్ ముందుగా నేచురల్ స్టార్ నానికి వినిపించాడట. నేచురల్ స్టార్ తో వేణు శ్రీరామ్ అప్పటికే ఎంసీఏ మూవీ చేశాడు. ఆ డైరెక్టర్ మీద హీరోకు నమ్మకం కూడా ఉంది. అయినప్పటికీ నాని ఆ ప్రాజెక్టుకు నో చెప్పాడు. ఇతర సినిమాల్లో బిజీ కారణంగానే నాని ఆ ప్రాజెక్టును వదులుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే రిజల్ట్ తేడా కొట్టేసింది. సుదీర్ఘ కెరీర్ ఉన్నప్పటికీ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ మూవీ కోసం పడిన కష్టం అంతా వృధా వర్క్ అవుట్ కాదని నాని కావాలనే ప్రాజెక్టును వదులుకున్నాడని విశ్లేషిస్తున్నారు. ఇతర ప్రాజెక్టుల్లో బిజీ కారణంగానా? లేక కావాలనే నానీ ఈ మూవీని వద్దనుకున్నారా? అనే విషయాల్లో ఏది నిజం అన్నది పక్కన పెడితే ఆయన డెసిషన్ మేకింగ్ సూపర్ అంటున్నారు ఆడియన్స్.