ఈ మధ్య కాలంలో ప్యాన్ ఇండియన్ మూవీస్ పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు నాని. అతని మూవీస్ అన్నీ మాస్ ను టార్గెట్ చేస్తున్నవే కావడం అందుకు కారణం. ప్రస్తుతం ద ప్యారడైజ్ అనే మూవీతో రూపొందుతున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. తర్వాత ఓ.జి దర్శకుడు సుజీత్ డైరెక్షన్ లో ఓ మూవీ చేయబోతున్నాడు నాని. ఈ రెండు సినిమాల తర్వాత మాత్రం ఏదీ ఒప్పుకోలేదు. బట్ ఓ తమిళ్ డైరెక్టర్ మాత్రం నానితో పని చేయాలనుకుంటున్నాడు. అతని పేరు ప్రేమ్ కుమార్.
96 మూవీతో ప్రేక్షకుల ప్రేమలో పడిపోయాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. తర్వాత మేయాళవన్ (సత్యం సుందరం) మూవీతో విపరీతంగా ఆకట్టుకున్నాడు. తెలుగులోనూ ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. కార్తీ, అరవింద్ స్వామి హీరోలుగా నటించిన ఈ మూవీ ఊహించే కథతోనే కావాల్సినంత వినోదాన్ని పంచాడు. ఆ దర్శకుడు విక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయాలనుకున్నాడు. ఫహాద్ ఫాజిల్ కూడా ఈ మూవీలో నటించబోతున్నాడు. ఈ మూవీ తర్వాత అతను నానితో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. అతని కోరిక మేరకే నానితో సినిమా చేయాలనుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయట. నానికి ఈ కథ నచ్చితే వెంటనే యస్ చెబుతాడు. ఆ మేరకు నాని ఒప్పించే పనిలో ఉన్నాడు ప్రేమ్ కుమార్. మొత్తంగా నానితో ప్రేమ్ కుమార్ సినిమా చేయడం మాత్రం తెలుగుతో పాటు తమిళ్ ఆడియన్స్ తో లవ్ లో పడిపోతారు.