Nani HIT 3 : నాని ఒంటరి పోరాటం ఫలిస్తుందా..?

Update: 2025-04-26 08:00 GMT

నేచురల్ స్టార్ నుంచి వయొలెంట్ స్టార్ గా మారబోతున్నాడు నాని. కొన్నాళ్లుగా తను కూడా మాస్ హీరోగా క్రేజ్ తెచ్చుకోవాలనే తాపత్రయపడుతున్నాడు. ఈ క్రమంలో కేవలం తెలుగులోనే కాదు ప్యాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. దసరా, శ్యామ్ సింగరాయ్, సరిపోదా శనివారం అంటూ ప్యాన్ ఇండియా రిలీజ్ ల కోసం ఆరాటపడుతున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం తను నటించిన హిట్ 3 చిత్రాన్ని కూడా అదే స్థాయిలో రిలీజ్ చేయాలని దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తూ అన్ని చోట్లా హిట్ 3పై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు.

తెలుగు నుంచి ఇప్పటి వరకూ ప్యాన్ ఇండియా స్టార్స్ అనిపించుకున్నవాళ్లలో రాజమౌళి వల్ల కొందరైతే, సుకుమార్ వల్ల అల్లు అర్జున్ అయ్యాడు. బట్ నాని మాత్రమే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ప్రతి సినిమానూ ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాడు. ప్రమోషన్స్ కోసం ఖర్చుపెడుతున్నాడు. హిట్ 3 సొంత సినిమానే. కాబట్టి మరింత ఖర్చు పెడుతున్నాడు. అయితే నాని చేస్తోన్న ప్రయత్నాల్లో ప్రమోషన్స్ వరకూ ఓకే కానీ.. ఆయా భాషల నుంచి కలెక్షన్ లెక్కల వరకు వచ్చే సరికి అంత స్థాయిలో కనిపించడం లేదు అనేది వాస్తవం. ఇప్పటి వరకూ అతను రిలీజ్ చేసిన దసరా, సరిపోదా శనివారం సినిమాలకు వేరే భాషల రిలీజ్ కు అయిన ఖర్చు ఎంత వచ్చిన రెవిన్యూ ఎంత అనేది చూస్తే వచ్చిందేం లేదు అనే చెప్పాలి.

ప్యాన్ ఇండియా హీరో అంటే ఇతర భాషల నుంచి కూడా కలెక్షన్స్ వసూలు కావాలి. అక్కడా ఫ్యాన్స్ రావాలి. ఈ విషయంలో చూస్తే నాని ఇంకా చాలా వెనకబడే ఉన్నాడు. అయినా అతను చేస్తోన్న ఈ ఒంటరి పోరాటం ఎంత దూరం వెళుతుందో చూడాలి. 

Tags:    

Similar News