టాలీవుడ్ యంగ్ రాజ్ తరుణ్, లావణ్య అనే యువతి వ్యవహారం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. లావణ్య అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై గతంలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ నెల 18లోగా విచారణకు రావాలని తాజాగా రాజ్ తరుణ్ కు నార్సింగి పోలీసులు నోటీసులు పంపారు. బీఎన్‌ఎస్‌ఎస్ 45 కింద రాజ్ తరుణ్‌కు నోటీసులు జారీ చేశారు.