Nayanatara-Vignesh: సరోగసీ కాంట్రావర్సీ.. 'కస్తూరి'పై ఫైర్ అవుతున్న 'నయన్' ఫ్యాన్స్..
Nayanatara-Vignesh: సరోగసీ పద్దతిలో పేరంట్స్ అయ్యారు నయనతార, విఘ్నేశ్ శివన్. ట్విన్స్‌కు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు..;
Nayanatara-Vignesh: సరోగసీ పద్దతిలో పేరంట్స్ అయ్యారు నయనతార, విఘ్నేశ్ శివన్. ట్విన్స్‌కు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు.. అయితే ఇండియాలో సరోగసీ బ్యాన్ అంటూ సీనియర్ యాక్టర్ కస్తూరి శంకర్ ట్వీట్ చేశారు. 2022 జనవరి నుంచి చట్టం అమల్లో ఉందని కస్తూరి తెలిపారు.
కస్తూరి ట్వీట్ పై నయనతార ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు.. వారికి తన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు కస్తూరి. లాయర్‌గా అర్హత సాధించిన వ్యక్తిగా చట్టపరమైన అంశాలపై విశ్లేషణ చేసే హక్కు తనకు ఉందని ఆమె తెలిపారు. నిస్వార్ధంగానే మాట్లాడాను.. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవని రిప్లై ఇచ్చారు.
ఇక గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న నయన్-విఘ్నేశ్ జూన్ 9న తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహ వేడుక మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది. ఇప్పుడు కవలలకు జన్మనిచ్చారు. అయితే కస్తూరి ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. మనదేశంలో సరోగసీపై బ్యాన్ ఉంది.
వైద్యపరంగా తప్పని పరిస్థితుల్లో తప్ప…సరోగసిని ప్రోత్సహించకూడదని, ఈ చట్టం జనవరి 2022 నుండి అమల్లోకి వచ్చిందని. దీని గురించి మనం రాబోయే రోజుల్లో చాలా వినబోతున్నాం' అంటూ కస్తూరి చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి అన్నది ఎక్కడా కస్తూరి ప్రస్తావించలేదు.
కానీ ఈ ట్వీట్ నయన్ దంపతుల గురించే అని భావించిన ఫ్యాన్స్ కస్తూరిపై ఫైర్ అవుతూ కామెంట్స్ పెట్టారు. పక్కన వాళ్ల గురించి పట్టించుకోవడం మానేసి.. నీ పని నువ్వు చూసుకో అంటూ కామెంట్స్ చేశారు. ఇక నెటిజన్లకు కస్తూరి కూడా ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు.
మరోవైపు సెలబ్రిటీలు బిడ్డల్ని కనడం లేదు..సరోగసీ ద్వారా అద్దె గర్భం ద్వారా తల్లి దండ్రులు అవుతున్నారు..గతంలో చాలామంది సెలబ్రిటీలు ఇదే పద్దతిలో పిల్లలను కన్నారు. షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, ప్రీతి జింటా, శిల్పా శెట్టి, మంచులక్ష్మి, కరణ్‌జోహార్ కూడా సరోగసితో పిల్లల్ని కన్నారు.
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార-విఘ్నేశ్ శివన్ దంపతులు ఇప్పుడు ట్విన్స్‌కి పేరంట్స్ అయ్యారు. తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ ఫోటోలను షేర్ చేశారు. తమ పిల్లలను ఆశీర్వదించాలని సోషల్ మీడియాలో కోరారు. దీంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు నయన్, విఘ్నేశ్ లకు విషెష్ చెబుతున్నారు.