Nayanthara Vignesh: ఆరేళ్ల క్రితమే పెళ్లైంది.. నయన్, విఘ్నేశ్ కొత్త ట్విస్ట్..
Nayanthara Vignesh: ఏడేళ్లుగా ప్రేమించుకున్న నయన తార. విఘ్నేశ్ శివన్ ఈ ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లై ఏడాది కూడా కాలేదు.. కవల పిల్లలు పుట్టారంటూ గత వారం ట్విస్ట్ ఇచ్చారు.;
Nayanthara Vignesh: ఏడేళ్లుగా ప్రేమించుకున్న నయన తార. విఘ్నేశ్ శివన్ ఈ ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లై ఏడాది కూడా కాలేదు.. కవల పిల్లలు పుట్టారంటూ గత వారం ట్విస్ట్ ఇచ్చారు. సరోగసి పద్ధతిలోనే పిల్లల్ని కని ఉంటారని నిర్ధారించుకున్న నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఈ వివాదానికి తెరదించేందుకు తమిళనాడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఆరోగ్య మంత్రి దీనిపై వివరణ ఇవ్వమంటూ నయన్ దంపతులను ఆదేశించారు. దీంతో ఈ జంట స్పందించినట్లు తమిళ మీడియా తెలిపింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి.
తమకు ఆరేళ్లక్రితమే పెళ్లైందని పేర్కొంటూ వివాహ నమోదు పత్రాన్ని అఫిడవిట్‌కు జత చేసినట్లు సమాచారం. నిబంధనల ప్రకారమే గత ఏడాది డిసెంబర్‌లోనే తాము సరోగసి కోసం రిజిస్టర్ చేసుకున్నారట. యూఏఈలో ఉంటోన్న నయన్ బంధువు ద్వారా సరోగసి పద్ధతిలో పిల్లలను పొందామని ఆ వార్తలోని సారాంశం.
గత ఏడాది నుంచి దేశంలో కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మినహా సరోగసిని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధం ఉన్నా సరోగసీ ద్వారా పిల్లలను ఎలా కన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు నయన్ దంపతులు వివరణ ఇచ్చినట్లు తమిళ పత్రికలు పేర్కొన్నాయి.