Viswak Sen : ఇప్పుడు అవసరమా ‘దాస్’ ..?

Update: 2025-04-05 11:30 GMT

రిలీజ్ కైనా రీ రిలీజ్ కైనా.. టైమూ, టైమింగూ చాలా ఇంపార్టెంట్. లేదంటే బూమరాంగ్ అవుతాయి. ప్రస్తుతం విశ్వక్ సేన్ విషయంలో ఇదే వినిపిస్తోంది. హీరోగా తనకు తాను బ్రేక్ ఇచ్చుకుని నిలబడ్డ వారిలో విశ్వక్ సేన్ ఒకడు. తర్వాత అప్పుడప్పుడూ హిట్స్ కొడుతున్నాడు కానీ.. మ్యాగ్జిమం ఫ్లాపులే పడుతున్నాయి. చివరగా వచ్చిన లైలా అయితే తీవ్రమైన విమర్శలను ఫేస్ చేసింది. సినిమా అభాసుపాలైంది. రిజల్ట్ సంగతి అలా ఉంచితే.. విశ్వక్ సేన్ పై చాలా వ్యతిరేకత మొదలైంది. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనుదీప్ కేవి డైరెక్షన్ లో ‘ఫంకీ’అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో నా సామిరంగా ఫేమ్ అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఓ దశలో కయాడు లోహర్ ను కూడా తీసుకుంటున్నారు అనే టాక్ వినిపించింది. సితార బ్యానర్ లో రూపొందుతోన్న ఫంకీపై విశ్వక్ సేన్ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఇదే బ్యానర్ లో రూపొందిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆశించిన విజయాన్ని కూడా ఇవ్వలేదు.

ఇక ఈ టైమ్ లో విశ్వక్ సేన్ తను డైరెక్ట్ చేసిన ‘ఫలక్ నుమా దాస్’ చిత్రాన్ని రీ రీలీజ్ చేస్తున్నాడు. ఈ నెల 10న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ మూవీతోనే అతను దర్శకుడుగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా కమర్షియల్ హిట్ గానూ నిలిచింది. క్లైమాక్స్ లో అతను చేసిన ఓ లాంగ్ షాట్ కు అప్లాజ్ వచ్చింది. బట్ ఇప్పుడు విశ్వక్ సేన్ ఉన్న పరిస్థితికి రీ రిలీజ్ అవసరమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కెరీర్ మంచి స్వింగ్ లో ఉన్నప్పుడు ఇలాంటి చిత్రాలు వస్తే ఆహా ఓహో అంటారు. అసలే మనోడిపై నెగెటివిటీ ఎక్కువగా ఉన్న టైమ్ ఇది. ఇలాంటప్పుడు ఆ సినిమాను రీ రిలీజ్ చేస్తే కావాలని కూడా ఈ చిత్రాన్నీ నెగెటివ్ చేసే అవకాశాలున్నాయి.

దీనికి తోడు ఈ మధ్య రీ రిలీజ్ అవుతున్న సినిమాలేవీ పెద్దగా ఆడటం లేదు. బాలయ్య క్లాసిక్ మూవీ ఆదిత్య 369 నే పట్టించుకోలేదు. ఇక ఫలక్ నుమా దాస్ అవసరమా అంటున్నారు.

Tags:    

Similar News