‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ సినిమాల జోరు పెంచారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో కొత్త సినిమాను అధికారంగా ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై VS14ను నిర్మించినట్లు పేర్కొన్నారు. విశ్వక్ ఇప్పటికే మెకానిక్ రాకీ సినిమాలో నటిస్తుండగా ఇటీవలే VS13ను ప్రకటించారు. మరోవైపు వినోదాత్మక చిత్రాల తీసే అనుదీప్ మూవీలో విశ్వక్ నటించనుండటంతో వీరిద్దరి కాంబినేషన్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
జాతి రత్నాలు' సినిమాతో తెలుగు ప్రజలను విపరీతంగా నవ్వించిన దర్శకుడు కేవీ అనుదీప్. దానికి ముందు 'పిట్టగోడ', ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా 'ప్రిన్స్' తీశారు. ఆయన సినిమాల్లో కామెడీ మాత్రమే కాదు... టీవీ షోస్, ఇంటర్వ్యూలలో ఆయన చెప్పే సమాధానాలు సైతం విపరీతంగా నవ్వించాయి. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో విశ్వక్ సేన్ సినిమా అనడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.