మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. హృతిక్ రోషన్ మరో హీరోగా నటించి ఈ చిత్రం యశ్ రాజ్ ఫిల్మ్స్ వారి స్పై వర్స్ లో భాగంగా రూపొందించారు. కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ లో కనిపించబోతోంది. ఎన్టీఆర్ ఇందులో నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర చేస్తున్నాడు అనే టాక్ ఉంది. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజులు టైమ్ ఉందంటూ ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ఎన్టీఆర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
వార్ 2 తో పాటు అదే రోజున రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, శృతి హీసన్, సౌబిర్ షబీన్ ప్రధాన పాత్రల్లో నటించిన కూలీ కూడా విడుదల కాబోతోంది. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. అయితే కూలీతో పోలిస్తే ప్రమోషన్స్ పరంగా వార్ 2 చాలా వెనకబడే ఉందని చెప్పాలి. ఈ విషయంలో ఫ్యాన్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ యశ్ రాజ్ వాళ్ల స్ట్రాటజీ ప్రమోషన్స్ విషయంలో ఎప్పుడూ కాస్త వీక్ గానే ఉంటుందని చెప్పాలి. తెలుగు స్టేట్స్ లో వార్ 2 ను నాగవంశీ రిలీజ్ చేస్తున్నాడు. అతను ఏకంగా 80 కోట్లు పెట్టి కొన్నాడు. ఆ మొత్తం రికవర్ కావాలంటే తను స్వయంగా కొన్ని ప్రమోషన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎన్టీఆర్ కు ఇక్కడ ఆ రేంజ్ ఉంది కానీ ఈ మూవీని తెలుగు ఆడియన్స్ ఏ మేరకు ఓన్ చేసుకుంటారు అనేది పెద్ద సమస్య. ఒకవేళ మనవాళ్లు వార్ 2 ను స్ట్రెయిట్ మూవీగానే చూసి సినిమా బావుంటే బ్లాక్ బస్టర్ ఖాయం.