సుధీర్ బాబు హీరోగా పదేండ్ల కిందట వచ్చిన 'భలే మంచి రోజు' సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ వామికా గబ్బీ. కెరీర్ స్టార్టింగ్ లో జూనియర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్లుగా మూవీలు చేసిన ఈభామ ఇప్పుడు బాలీవుడ్ సయా సెన్సేషన్. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ బేబీ జాన్ ఆమెను పాపులర్ బ్యూటీగా మార్చేసింది. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. వచ్చిన ప్రతి అవ కాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తోంది.
అందుకే ఈ అమ్మడు బాలీవుడ్లో క్రేజీ చిత్రాల్లో నటించే ఆఫర్స్ కొల్లగొడుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సినిమాలు ఉన్నాయి. హిందీలో రాజ్ కుమార్ రావ్ హీరోగా వస్తోన్న భూల్ చుక్ మాఫ్ లో నటిస్తోంది. ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతుంది. దిల్ కా దర్వాజా కోల్ నా డార్లింగ్, అక్షయ్ కుమార్ భూత్ బంగ్లాతో పాటు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తోన్న ప్రెస్టిజి యస్ ప్రాజెక్ట్ రక్త బ్రహ్మాండ్ లో కీ రోల్ ప్లే చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
బాలీవుడ్లోనే కాదు అటు పంజాబీతో పాటు ఇటు సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తోంది వామికా. తెలుగులో దశాబ్ధం తర్వాత అడివి శేష్ క్రేజీయెస్ట్ మూవీ గూఢచారి-2లో కమిటైంది ఈ నయా సెన్సేషన్. అలాగే తమిళంలో జీని అనే భారీ బడ్జెట్ చిత్రంలోనూ యాక్ట్ చేయబోతుంది. మలయాళంలో టికీ టాతో పాటు రణబీర్ అప్ కమింగ్ ప్రాజెక్టులో కూడా వామిక పేరు వినిపిస్తోంది.
ఒకేసారి ఇన్ని భాషల్లో నటిస్తున్న హీరోయిన్ వామికా అంటూ నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో సగం సక్సెస్ అయినా పదేండ్ల పాటు ఈ అమ్మడి సినీ జర్నీ జెట్ స్పీడ్ తో సాగుతుందని సినీ విశ్లేష కులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.