Deepthi Sunaina: 'ఆ విషయం నాకే తెలీదు'.. వైరల్ అవుతున్న రూమర్‌పై దీప్తి సునయన స్పందన..
Deepthi Sunaina: ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు సినిమాల్లో నటించడానికి సిద్ధమయిపోతున్నారు.;
Deepthi Sunaina (tv5news.in)
Deepthi Sunaina:యూట్యూబర్ దీప్తి సునయన షార్ట్ ఫిల్మ్స్‌తో, డబ్‌స్మాష్‌లతో తన కెరీర్‌ను ప్రారంభించింది. అలాగే మెల్లగా బిగ్ బాస్‌లాంటి అతిపెద్ద రియాలిటీ షోలో మెరిసే అవకాశాన్ని దక్కించుకుంది. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా దీప్తి సునయన తన సోషల్ మీడియాతోనే ఎక్కువగా కాలాన్ని గడిపేసింది. అలాంటి దీప్తిపై ప్రస్తుతం ఓ వార్త వైరల్‌గా మారింది.
దీప్తి సునయన గురించి ఇటీవల సోషల్ మీడియా అంతా ఎక్కువగా మాట్లాడుకుంటోంది. దానికి కారణం షణ్నూతో బ్రేకప్. అయిదు సంవత్సరాల నుండి రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరినీ బిగ్ బాస్ విడదీసింది అనే రూమర్ ఒక్కసారిగా ఇన్‌స్టా్గ్రామ్ అంతా వైరల్ అవ్వడంతో పాటు చాలామంది దీని గురించి మాట్లాడేలా చేసింది. తాజాగా మరో రూమర్ కూడా ఒక్కసారిగా అందరి చూపు దీప్తి వైపు తిప్పేలా చేసింది.
ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు సినిమాల్లో నటించడానికి సిద్ధమయిపోతున్నారు. అందులో కొందరు త్వరలోనే హీరోలుగా, హీరోయిన్లుగా కూడా పరిచయమవుతున్నారు. అలాగే దీప్తి సునయన కూడా త్వరలోనే వెండితెరపై హీరోయిన్‌పై అడుగుపెట్టనుందని గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అందులో నిజం లేదంటూ దీప్తి క్లారిటీ ఇచ్చేసింది. తాను హీరోయిన్ కానుంది అన్న ఒక్క పోస్ట్‌ను షేర్ చేస్తూ.. 'నాకే తెలీదే ఇది' అంటూ క్యాప్షన్ పెట్టి తాను హీరోయిన్‌గా మారట్లేదు అని క్లారిటీ ఇచ్చేసింది.