Ranbir Alia News: ఒక్కటవ్వనున్న బాలీవుడ్ ప్రేమ జంట.. అక్కడే డెస్టినేషన్ వెడ్డింగ్..
Ranbir Alia News: యంగ్ హీరో రణభీర్ కపూర్.. బాలీవుడ్‌లో లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు.;
Ranbir Alia News (tv5news.in)
Ranbir Alia News: యంగ్ హీరో రణభీర్ కపూర్.. బాలీవుడ్‌లో లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. దాదాపు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న వారితో తాను ప్రేమ వ్యవహారాన్ని నడిపాడు. తన ఒకప్పటి గర్ల్‌ఫ్రెండ్స్ అందరూ పెళ్లిళ్లు చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోయారు. కానీ రణభీర్ మాత్రం ఇంకా ఒక ఇంటివాడు కాలేదు. ప్రస్తుతం తన ప్రొఫెషనల్ లైఫ్ మీదే ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు రణభీర్. తాజాగా తన పెళ్లి గురించి ఒక వార్త వైరల్‌గా మారింది.
బాలీవుడ్‌లోని ఇతర యంగ్ బ్యూటీలతో పోటీపడుతూ నెంబర్ 1 కిరీటానికి అతి చేరువలో ఉంది ఆలియా భట్. ప్రేక్షకుల్లో తనకు ఎంత నెగిటివిటీ ఉందో.. అంతకంటే ఎక్కువ ఫ్యాన్‌బేస్ కూడా ఉంది. ఎలాంటి కథ అయినా ఆలియా పూర్తి శాతం న్యాయం చేస్తుందని ఫిక్స్ అయిపోయారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో అమ్మడు చాలా బిజీగా గడిపేస్తోంది. అయితే కెరీర్ నుండి కాస్త బ్రేక్ తీసుకొని ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటోందట ఆలియా.
రణభీర్‌కు ఇంతకు ముందే పలువురితో లవ్ ఎఫైర్స్ ఉన్నాయి. ఆలియా కూడా పలువురు యంగ్ హీరోలతో డేటింగ్ చేస్తుందని అప్పుడప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో వార్తలు వినిపించాయి. కానీ ఈ ఇద్దరు ప్రస్తుతం ఒక సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఒక అవార్డ్ ఫంక్షన్‌లో అందరి ముందు రణభీర్‌పై తనకున్న ప్రేమను బయటపెట్టింది ఆలియా. అప్పటినుండి వీరు బాలీవుడ్‌లో అఫీషియల్ లవ్ కపుల్ అయిపోయారు.
ఆ తర్వాత నుండి వారి ప్రేమ గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా.. దాని గురించి వారు సీరియస్‌గా ఉన్నారని స్పష్టం చేస్తూ వచ్చింది ఆలియా. అంతే కాకుండా వీరిద్దరు పెళ్లి చేసుకునే ప్లాన్‌లో కూడా ఉన్నారట. అన్ని అనుకున్నట్టు జరిగితే గతేడాదిలోనే వీరి రణభీర్, ఆలియా పెళ్లి జరిగిపోవాల్సింది. కానీ కరోనా కారణంగా అది కాస్త పోస్ట్‌పాన్ అయ్యింది.
తాజాగా మరోసారి రణభీర్, ఆలియా పెళ్లి గురించి ఒక వార్త వైరల్‌గా మారింది. వీరిద్దరు డిసెంబర్‌లో పెళ్లి పీటలెక్కనున్నట్టుగా తెలుస్తోంది. రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లానింగ్ కూడా మొదలయిపోయిందట. రాజస్థాన్‌లోని ఐకానిక్ ప్యాలెస్ హోటల్‌లో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఏర్పాటు చేస్తు్న్నారట. పెళ్లి తేదీపై క్లారిటీ లేకపోయినా వీరిద్దరి పెళ్లి గురించి ఈ వార్త అప్పుడే సోషల్ మీడియా అంతా వ్యాపించింది.