డార్లింగ్ హీరో ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా రాజాసాబ్. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్దికుమార్, సంజయ్ దత్ తదితర ప్రముఖులు కూడా ఈ సినిమాలో నటస్తున్నారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది నిధి అగర్వాల్. ప్రేక్షకులు ఎక్కువగా తన నుంచి గ్లామర్ పాత్రలు ఆశిస్తారని, తాను కూడా అలాంటి పాత్రలే ఎక్కువ చేస్తానని అన్నారు. రాజాసాబ్లో ప్రేక్షకులు తనపై ఉన్న ఈ అభిప్రాయాన్ని మార్చుకుంటారని అంటోంది. ఈ సినిమాలో తన పాత్ర రెగ్యులర్ హాట్ పాత్రలకు భిన్నంగా ఉంటుందని తెలిపింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. తన పాత్రను ప్రేక్షకులు ఊహించలేరంటోంది నిధి అగర్వాల్. ప్రభాస్ మొదటిసారి హారర్ నేపథ్యంలో ఉన్న కథలో నటిస్తుండటంతో అందరి దృష్టి ఈ చిత్రంపైనే ఉంది. ఈ మూవీ వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.