నటిగా అలరిస్తూనే ప్రొడ్యూసర్ గా మారింది మెగా డాటర్ నిహారిక కొణిదెల. 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పేరుతో సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసింది. ఇందులో వరుసగా వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. రీసెంట్ గానే 'కమిటీ కుర్రోళ్లు' సినిమాను తీసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు కంటెంట్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటోంది నిహారిక. ఇక తాజాగా తన బ్యానర్ లో మరో ఫీచర్ ఫిల్మ్ తెరకెక్కించబోతుంది. ఈ సినిమాను కాస్త ఎక్కువ బడ్జెట్ తోనే తీస్తున్నారంట. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో మానస ఇప్పటికే రెండు సిరీస్ లను డైరెక్ట్ చేశారు. బెంచ్ లైఫ్, ఒక చిన్న ఫ్యామిలీ మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఆమె డైరెక్షన్ లో ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ రాబోతోంది. ఇందులో నటీనటులను త్వరలోనే ఫైనల్ చేయబోతున్నారు. నిహారిక ఈ సినిమాను ప్రత్యేకంగా తీసుకుంటుందంట. ఇందులో పెద్దనటులు ఉండే అవకాశా లు ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. ఈ సినిమా హిట్ అయితే నిహారిక కూడా టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గా నిలదొక్కుకుంటుందని చెబుతున్నారు.