Actress Nikhila Vimal : తమిళ, మలయా ళంలో నిక్కీ బిజీ

Update: 2025-03-03 12:30 GMT

అల్లరి నరేష్ మేడ మీద అబ్బాయితో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కేరళ బ్యూటీ నిఖిలా విమల్.. మోహన్ బాబు గాయత్రిలోనూ నటించి మెప్పించింది. ఈ రెండు ఆమెకు క్రేజ్ తెచ్చిపెట్టలేదు సరికదా.. ఆఫర్లను అందించలేకపోయాయి. దీంతో సొంతగూటికి చేరిపోయింది ఈ మళయాళీ సోయగం. మాలీవుడ్ లో వరుస ఆఫర్ల తో.. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో స్టార్ డమ్ తెచ్చుకుంది. అటు తమిళంలోనూ మంచి ఆఫర్లు కొల్లగొడుతూ సక్సెస్ అందుకుంది. ద ప్రీస్ట్, తంబి, జో అండ్ జో, పోర్ తొజిల్, గురువాయిర్ అంబలనడయి ల్, నునాకుజి, వాజై చిత్రాలు బాక్సాఫీసు వద్ద సందడి చేశాయి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ నిఖిలా విమల్ ను మాలీవుడ్, కోలీవుడ్లో స్టార్ హీ రోయిన్గా మార్చేశాయి. దీంతో చాన్సులు కూడా వెల్లువలా వచ్చిపడుతున్నాయి. కానీ సెలక్టివ్ సినిమాలే చేస్తోంది ఈ బ్యూటీ. ప్రజెంట్ నిక్కీ పెన్ను కేస్, నివిన్ పాలీ తారం చిత్రాల్లో నటిస్తోంది. అలాగే ఆర్యతో బైలింగ్వల్ మూవీతో పాటు అనాలి అనే వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేస్తోంది. ఇలా తమిళ, మలయా ళంలో బిజీగా ఉన్న బ్యూటీ మళ్లీ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడు పల కరిస్తుందో? వేచి చూడాలి.

Tags:    

Similar News