Nitesh Desai Suicide: రూ.250 కోట్ల అప్పే కారణమా!? ఆడియో రికార్డింగ్ స్వాధీనం
నితిన్ దేశాయ్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు;
ప్రఖ్యాత చిత్ర కళా దర్శకుడు నితిన్ దేశాయ్ మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని తన ఎన్‌డి స్టూడియోలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ముందుగా సూసైడ్ నోట్ లాంటి ఎలాంటి ఆధారాలు గుర్తించలేదు. కానీ ఓ ఆడియో రికార్డింగ్ ఉన్నట్టు కనుగొన్నారు. దాన్ని ఫోరెన్సిక్ టీం దర్యాప్తు చేస్తుందని సమాచారం. ప్రస్తుత సమాచారం ప్రకారం ఆర్ట్ డైరెక్టర్ ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. రూ. 250 కోట్ల రుణాన్ని చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న దేశాయ్.. అతని కంపెనీకి వ్యతిరేకంగా కోర్టు గత వారంలో దివాలా పిటిషన్‌ను అంగీకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
నితిన్ దేశాయ్ అప్పుల పాలయ్యాడు
దేశాయ్ కంపెనీ, ఎన్‌డి ఆర్ట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, సీఎఫ్‌ఎం నుంచి రెండు సార్లు మొత్తం ద్వారా రూ.180 కోట్లు అప్పుగా తీసుకుంది. ఈ రుణ ఒప్పందం 2016, 2018లో జరిగింది. అయితే ఈ మొత్తాన్ని చెల్లించడంలో నితిన్ దేశాయ్ కు జనవరి 2020 నుంచి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. దీని కోసం దేశాయ్ మొత్తం 42 ఎకరాల భూమిని తనఖా పెట్టాడు. కొంత సమయం తర్వాత, CFM తన రుణ ఖాతాలన్నింటినీ ఎడెల్‌వీస్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించింది. అయితే అప్పు కూడా రికవరీ కాలేదు. అందుకే ఎడిల్‌వీస్ కంపెనీ తనఖా పెట్టిన భూమికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసి రుణాల రికవరీ కోసం సర్ఫాఈసీ చట్టం కింద చర్యలు తీసుకునేందుకు అనుమతి కోరింది. ఈ ప్రతిపాదన గతేడాది సెప్టెంబర్‌లో ఇవ్వగా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. దీంతో దేశాయ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ విషయమై కొద్దిరోజుల క్రితం ఖలాపూర్ ఎమ్మెల్యే మహేష్ బల్దితో కూడా చర్చించారు.
రుణ రికవరీ కోసం ఫైనాన్స్ కంపెనీ ఎడెల్వీస్ ND స్టూడియోని వేలం వేయబోతున్నట్టు పలు నివేదికలు సూచిస్తున్నాయి. సుమారు 15 సంవత్సరాల క్రితం, రిలయన్స్.. ఎన్‌డీ స్టూడియోలో 50 శాతం వాటాను కొనుగోలు చేసింది. అయితే తరువాత అనిల్ అంబానీ కంపెనీ స్వయంగా అప్పుల పాలైంది. దీని కారణంగా ఎన్‌డీని ప్రపంచ స్థాయి స్టూడియోగా మార్చాలనే కల చెదిరిపోయింది.
నితిన్ దేశాయ్ వెబ్ సిరీస్
సుమారు నెలన్నర క్రితం, నితిన్ దేశాయ్ తన వెబ్ సిరీస్ 'మహారాణా ప్రతాప్' గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. దీని కోసం ప్రధాన నటుడు గుర్మీత్ చౌదరితో లుక్ టెస్ట్ కూడా జరిగింది. 30-ఎపిసోడ్ల సిరీస్ డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం చేయాల్సి ఉంది.