Nivetha Pethuraj : లక్కంటే నీదే నివేత ... ఇద్దరు స్టార్ లతో ఒకే సినిమాలో...!

Nivetha Pethuraj : మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..

Update: 2022-03-16 10:30 GMT

Nivetha Pethuraj : మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో మాస్ మాహరాజ్ రవితేజ ఓ కీరోల్ పోషిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం రవితేజ ఏకంగా రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడట.

అయితే ఈ సినిమాలో రవితేజకి జోడీగా నివేత పెతురాజ్‌‌ను తీసుకున్నారట.. ఆమె సినిమాలో ఉండేది కొద్దిసేపు అయినప్పటికీ కీలక పాత్ర అని తెలుస్తోంది. తెలుగులో చిత్రలహరి, బ్రోచేవారెవరురా, రెడ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది నివేత పెతురాజ్. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోలైన చిరు, రవితేజలతో ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. రవితేజతో కలిసి సెట్స్ లోకి రానుందట నివేత.

ఇక ఈ సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్‌‌గా ఇప్పటికే శృతిహాసన్ ను తీసుకున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ని పరిశీలనలో ఉంచారు. 

Tags:    

Similar News