మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్ అచ్చమైన తెలుగింటి మధ్యతరగతి గృహిణిలా చీరకట్టులో కనిపించనుంది. రానా దగ్గుబాటి నిర్మాతగా సురేష్ ప్రొడక్షన్స్ లో 35 అనే మూవీని నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకొచ్చి అందరికి కనెక్ట్ అయ్యింది. ఈ చిత్రంలో నివేదా థామస్ ఇద్దరు పిల్లల తల్లిగా నటించింది. పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు పడే ఇబ్బందులు, కుటుంబ బంధాలు, బాధ్యతలని ఈ సినిమాలో చక్కగా చూపించినట్లు కనిపిస్తోంది. నందకిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పోస్టర్ ను మేకర్స్ ఇవాళ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు మోడ్రన్ టచ్ ఉన్న అమ్మాయి పాత్రలలోనే నివేదా థామస్ చాలా సినిమాలలో కనిపించింది. అయితే మొదటి సారి సాధారణ మధ్యతరగతి గృహిణిగా సరస్వతి పాత్రలో ఆమె 35 చిత్రంలో కనిపిస్తోంది. చక్కనైన చీరకట్టుతో నిలువెత్తు తెలుగందంతో నివేదా మెరిసిపోతోంది. సరస్వతి క్యారెక్టర్ కి సంబంధించిన ఇంటరెస్టింగ్ వీడియోని సరస్వతి నమస్తుభ్యం పేరుతో జులై 17న సాయంత్రం 4:35 గంటలకి రిలీజ్ చేస్తున్నామని పేర్కొంటూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో నివేదా థామస్ చక్కని చిరునవ్వుతో కాటన్ సారీలో నిండుగా కనిపిస్తూ..ఎట్రాక్ట్ చేస్తోంది.