నందమూరి బాలకృష్ణ నట ప్రయాణం 50యేళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆదివారం రోజు దేశవ్యాప్తంగా ఉన్న అతిరథులైన నటీ నటులను ఆహ్వానించి రంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులను ఆహ్వానించేందుకు కమిటీ రామకృష్ణను నియమించింది. అయితే ఎలా చూసినా నందమూరి ఫ్యామిలీలో ఫస్ట్ టైమ్ నటుడుగా 50యేళ్లు పూర్తి చేసుకున్న బాలయ్య ఫంక్షన్ అంటే కుటుంబం మొత్తం వస్తుంది. కానీ ఎందుకో జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందలేదు. గతంలో పెద్దాయన శత జయంతి సభకూ రాలేదు ఎన్టీఆర్. అప్పుడే రానివాడు ఇప్పుడేం వస్తాడు అనుకున్నారో లేక.. కొన్నాళ్లుగా ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబం పక్కన బెట్టింది. ఈ కారణంగానే ఆయన్ని పిలవలేదా అనేది ఎవరి ఊహలకు వాళ్లకే వదిలేయొచ్చు.
విశేషం ఏంటంటే.. ఆదివారం రోజున బాలయ్య ఫంక్షన్ జరుగుతుండగా.. శనివారం ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి తన తల్లి సొంత ఊరు కర్ణాటకలోని కుందాపుర వెళ్లాడు. ఉడిపి టెంపుల్ లో శ్రీ కృష్ణుడి ఆశిస్సులు కూడా అందుకున్నాడు. అంటే అతను కూడా బాలయ్య ఫంక్షన్ ను ‘స్కిప్’ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఉన్నాడు అనుకోవచ్చా. ఒకవేళ ఇవాళే నందమూరి రామకృష్ణ... తారక్ ను ఆహ్వానించాలనుకుంటే అప్పుడు ఇలాగే అర్థం అవుతుంది కదా. ఏదేమైనా నందమూరి ఫ్యామిలీ అంతా కలిసే ఉంది.. ఒక్క జూనియర్ తప్ప.