Actre Aishwarya Lakshmi : నో మ్యారేజ్..ఐశ్వర్య లక్ష్మి ఆసక్తికర కామెంట్స్

Update: 2024-11-21 09:45 GMT

మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది రాజీపడి బ్రతుకుతున్నారని అది తనకు నచ్చదని చెప్పింది ఈ బ్యూటీ. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఐశ్వర్య లక్ష్మి ఇటీవల ఓ ఇంటర్వ్యూకి వెళ్లారు. అందులో ఆమె మాట్లాడుతూ “జీవితంలో నేను పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యాను. చాలా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. పెళ్లి చేసుకున్న చాలా మందిని అబ్సర్వ్ చేశాను. వారిలో చాలా మంది రాజీ పడి బతుకుతున్నారు. అది నావల్ల కాదు. అంతేకాదు చాలా మంది కెరీర్ లో ఎదగలేకపోతున్నారు. అందుకే నో పెళ్లి అని ఫిక్సయ్యాను. నా చిన్నప్పుడు గురువాయూర్ గుడిలో చాలా పెళ్లిళ్లు చూశాను. నేను కూడా అలానే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ, ఇప్పుడు క్లారిటీ వచ్చింది” అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య లక్ష్మి. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ చూసి ఫ్యాన్స్ హార్ట్ అవుతున్నారు.

Tags:    

Similar News