Nora Fatehi: ఇన్ఫెక్షన్ వల్ల బెడ్‌కే పరిమితమయిన బాలీవుడ్ బ్యూటీ..
Nora Fatehi: దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు.;
Nora Fatehi (tv5news.in)
Nora Fatehi: దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లోని కపూర్ ఫ్యామిలీలో చాలామందికి కోవిడ్ సోకింది. ముందుగా కరీనా కపూర్‌కు పాజిటివ్ అని తేలగా.. తాజాగా అర్జున్ కపూర్‌కు, మరికొందరికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. కాగా మరో బాలీవుడ్ నటి కూడా కరోనా బారిన పడినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
నోరా ఫతేహి.. అటు నటిగా, ఇటు డ్యాన్సర్‌గా బాలీవుడ్‌ను ఏలేస్తోంది. ప్రస్తుతం సినిమాలో నోరా పాట ఉందంటే చాలు.. ఆ పాట వల్లే సినిమాకు హైప్ వస్తున్న పరిస్థితి కూడా ఏర్పడింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నోరాకు కరోనా చాలా సీరియస్‌గా అటాక్ అయ్యిందంటూ ఎమోషనల్‌గా తన పరిస్థితిని సోషల్ మీడియా ఫ్యాన్స్‌తో పంచుకుంది.
'నేను ప్రస్తుతం కోవిడ్‌తో పోరాడుతున్నాను. ఇన్ఫెక్షన్ నాకు చాలా తీవ్రంగా సోకింది. వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటూ.. కొన్నిరోజులుగా బెడ్‌కే పరిమితమయ్యాను. అందరూ జాగ్రత్తగా ఉండండి, మాస్కులు ధరించండి. కోవిడ్ చాలా వేగంగా వ్యాపిస్తూ.. ఎవరిని, ఎప్పుడైనా, ఏ రకంగా అయినా ఎఫెక్ట్ చేయొచ్చు. మీ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేసింది నోరా ఫతేహి.