NTR 31 : గడ్డం, మీసాలతో ఊరమాస్ లుక్ లో ఎన్టీఆర్...!
NTR 31: ఇవాళ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకి బిగ్ ట్రీట్ ఇచ్చింది నందమూరి ఆర్ట్స్..;
NTR 31: ఇవాళ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకి బిగ్ ట్రీట్ ఇచ్చింది నందమూరి ఆర్ట్స్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, నందమూరి ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ మూవీ నుంచి ఓ ఫోటోను రిలీజ్ చేశారు.. ఇందులో ఎన్టీఆర్ గడ్డం, మీసాలతో ఊరమాస్ లుక్ లో కనిపిస్తూ కంటిచూపుతోనే బయపెడుతున్నారు. ఎన్టీఆర్ ఈ లుక్ లో కొత్తగా ఉన్నారంటూ అభిమానులు తెగ సంబరపడుతున్నారు.
ఇది ఎన్టీఆర్ కి 31వ చిత్రం కావడం విశేషం. సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి.
#Ntr30 🔥#NTR31 🔥#HBDManOfMassesNTR pic.twitter.com/G2OMIVdoPH
— NTR Arts (@NTRArtsOfficial) May 20, 2022