RRR Twitter Review : ఎన్టీఆర్, చరణ్ ఇంట్రడక్షన్ ఇంకో లెవల్ అంతే...!

RRR Twitter Review : యావత్ దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Update: 2022-03-25 01:21 GMT

RRR Twitter Review : యావత్ దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆర్ఆర్ఆర్ మూవీ నేడు (మార్చి 25న ) భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌‌చరణ్‌‌ల కష్టం వెండితెర పైన ఆవిష్కృతమైంది... ప్రీమియర్ షోలు ప్రపంచవ్యాప్తంగా మొదలవ్వడంతో ప్రేక్షకులు సినిమాని చూసి తమ అభిప్రాయన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తున్నారు.

సినిమాలో ఎన్టీఆర్, రామ్‌‌చరణ్‌‌ల ఇంట్రడక్షన్ సన్నివేశాలు ఇంకో లెవల్ అంటున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయినట్లుగా పోస్ట్‌‌లు పెడుతున్నారు. నాటు నాటు పాట సీట్లో కూర్చోనివ్వదని అంటున్నారు. అలియా భట్ ఎంట్రీతో సినిమా గమనమే మారుతుందని, రాజమౌళి సినిమాని ముందుకు తీసుకెళ్ళిన విధానం రియల్లీ హ్యాట్సాఫ్ అని అంటున్నారు. మొత్తం థియేటర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లకంటే రాజమౌళి నామస్మరణే మొగుతుందని కొందరు అభిమానులు పోస్ట్‌‌లు పెడుతున్నారు.



రాజమౌళి టేకింగ్ మైండ్ బ్లోయింగ్ అని అందరి అంచనాలు దాటేశారని, ఇద్దరు హీరోలను స్క్రీన్ పైన చూపించి చింపేశారని అంటున్నారు. క్లైమాక్స్ సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉన్నాయని, ఇద్దరు హీరోల నటన అత్యద్భుతంగా ఉందని చెబుతున్నారు. అజయ్ దేవగన్ స్క్రీన్ ప్రెజన్స్ అద్భుతమని, ఉన్నది కొద్దిసేపే అయినప్పటికి సూపర్ అంటున్నారు.

మొత్తానికి ఆర్ఆర్ఆర్ అంటే రిపీట్.. రిపీట్.. రిపీట్(మళ్ళీ మళ్ళీ చూసేలా అనిపిస్తుందని) అనేస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌‌గా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించారు. డివివి దానయ్య ఈ మూవీని నిర్మించగా, కీరవాణి మ్యూజిక్ అందించారు.





Tags:    

Similar News