NTR : 'పన్నెండు దాటింది.. నీ బర్త్‌డే అయిపోయింది' : లక్ష్మీప్రణతి పై ఎన్టీఆర్ కామెంట్స్
NTR : బాహుబలి మూవీ తర్వాత జక్కన్న డైరెక్షన్‌లో వస్తోన్న మూవీ ఆర్‌ఆర్‌ఆర్.. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు.
NTR : బాహుబలి మూవీ తర్వాత జక్కన్న డైరెక్షన్‌లో వస్తోన్న మూవీ ఆర్‌ఆర్‌ఆర్.. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్, చరణ్ పక్కన అలియా భట్ మేరిశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమా పైన భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ యూనిట్‌ని టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చేశాడు.
ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు చరణ్, ఎన్టీఆర్.. అందులో భాగంగా చరణ్‌తో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టాడు ఎన్టీఆర్. మార్చి 26న తన భార్య లక్ష్మీప్రణతి పుట్టినరోజు అని, మార్చి 27న చరణ్ పుట్టినరోజని చెప్పాడు ఎన్టీఆర్.. అయితే చరణ్, తన ఇళ్లు ఒకే చోట ఉండడంతో.. మార్చి 26న అర్ధరాత్రి 12 గంటలయ్యాక.. నేను నా గేటు దగ్గరుంటే.. చరణ్ కారు రాగానే అందులో ఎక్కేసి వెళ్లిపోయేవాడిని తెలిపాడు.
అయితే అ టైంలో ప్రణతి ఫోన్ చేసి 'నా బర్త్‌డే, నువ్వెక్కడున్నావ్?' అంటే పన్నెండు దాటింది, నీ బర్త్‌డే అయిపోయింది అని చెప్పేవాడినని వెల్లడించాడు ఎన్టీఆర్. కాగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం భారీ అంచనాల నడుమ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.