నందమూరి బాలకృష్ణ నట వారసుడు తెరంగేట్రం స్టార్ట్ అయింది. షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు కానీ.. ఇవాళ మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు నందమూరి కొత్త హీరో. గతంలో అతని లుక్ కు భిన్నంగా చాలా సన్నబడ్డాడు.. హ్యాండ్సమ్ లుక్ తో ఉన్నాడు మోక్షు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయబోతోన్న ఈ మూవీ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. మామూలుగా ఓ కొత్త హీరో.. అది కూడా ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వస్తోన్న కుర్రాళ్లను ఇప్పటి వరకూ కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న మూవీస్ తోనే పరిచయం చేశారు. బట్ మోక్షజ్ఞ కోసం ఆ ఎలిమెంట్స్ త పాటు కాస్త ఫాంటసీ మిక్స్ అయిన ఫిక్షన్ స్టోరీ కూడా యాడ్ చేశారట. ఈ ఫిక్షన్ లో బాలకృష్ణ కూడా ఉంటాడని టాక్.
ఇక మోక్షజ్ఞ ఎంట్రీపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి. మోక్షుకి బర్త్ డే విషెస్ చెబుతూ.. ‘ సినిమా ప్రపంచంలోకి వస్తోన్న సందర్భంగా అభినందనలు. జీవితంలో ఓ కొత్త అధ్యాయం మొదలవుతోన్న వేళ తాతగారి పాటు అందరు దేవుళ్ల ఆశిస్సులు నీకు ఉంటాయి.. ’అని అభినందనలు తెలిపాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కి మోక్షజ్ఞ తమ్ముడి వరస అవుతాడు. మోక్షుకి కూడా ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం అని అందరికీ తెలుసు. మొత్తంగా నందమూరి ఫ్యామిలీ నుంచి మరో తరం హీరో ఎంట్రీ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.