NTR : ఫస్ట్ టైమ్ ఆ క్లబ్ లోకి ఎన్టీఆర్

Update: 2024-09-30 04:49 GMT

కంటెంట్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసేవాళ్లే స్టార్ హీరోలు. ఈ జెనరేషన్ లో ఆ స్టామినా ఉన్న హీరోస్ లో ఎన్టీఆర్ ఒకడు. ఆర్ఆర్ఆర్ తర్వాత సోలోగా ఫస్ట్ టైమ్ ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి దేవరగా ఎంట్రీ ఇచ్చాడు. సెకండ్ హాఫ్ వీక్ అన్న టాక్ ఉన్నా.. దేవర బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. పాత రికార్డులు తిరగరాస్తోంది. కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఎన్టీఆర్ కెరీర్ లో మరో బెస్ట్ మైల్ స్టోన్ ను అందుకుంది దేవర.

రిలీజ్ కు చాలా రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తో యూఎస్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది దేవర. ముఖ్యంగా నార్త్ అమెరికాలో తిరుగులేని రికార్డులున్నాయి. తర్వాత యూఎస్ మొత్తం అదే స్థాయి ఊపు కనిపించింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 2 మిలియన్ వరకూ కలెక్ట్ చేసిన దేవర మూడు రోజుల్లో 5 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి ఎన్టీఆర్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది.

5 మిలియన్ క్లబ్ లోకి ఎంటర్ కావడం ఎన్టీఆర్ కు ఇదే ఫస్ట్ టైమ్. ఇది ఓ రకంగా అతని కెరీర్ లో ఓ బెస్ట్ మూమెంట్ అనే చెప్పాలి. ఓ డిజాస్టర్ డైరెక్టర్ తో ఈ ఫీట్ సాధించడం అంటే అది కేవలం ఎన్టీఆర్ కెపాసిటీ వల్ల మాత్రమే సాధ్యమైన ఫీట్. ఓవర్శీస్ లో వీక్ డేస్ లో కాస్త్ డల్ అయ్యే అవకాశాలున్నా.. ఇండియాలో గాంధీ జయంతి కలిసొస్తుంది. తెలుగులో దసరా హాలిడేస్ ఉన్నాయి. అందువల్ల ఓవరాల్ గా దేవర కలెక్షన్స్ పరంగా చాలా పెద్ద ప్లేస్ కు వెళ్లే అవకాశం ఉంది.

Tags:    

Similar News