ఎన్టీఆర్ ఢీల్లీ హై కోర్ట్ లో కేస్ పెట్టాడు. తనపై కొంతమంది సోషల్ మీడియా యూజర్లు అంతా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల అబ్యూసింగ్ చేస్తున్నారు. వారిపై ఖచ్చితంగా కేస్ లు వేయాలి అని అడిగాడు. కొంతమంది వినియోగదారులు ఆన్‌లైన్‌లో తన ప్రతిష్టను దిగజార్చుతున్నారని పేర్కొంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు, 2021 ఐటీ నిబంధనల ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 22న జరగనుంది, అప్పుడు వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేయబడతాయి. ఇది విషయం.
నిజానికి కొన్నాళ్లుగా ఎన్టీఆర్ పై తీవ్రమైన నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు కొందరు. అతని మాటలు, బాడీ లాంగ్వేజ్, ఫిజిక్ పైనా విమర్శలు చేస్తున్నారు. చివరికి అతని పిల్లలపై కూడా నెగెటివ్ గా ప్రచారం చేస్తున్నారు. సినిమాలకు సంబంధించి కూడా అతను కొన్ని మాటలు కూడా పడుతున్నాడు. ఈ మొత్తం వ్యవహారం శ్రుతి మించి పోయింది. అందుకే ఢిల్లీ హై కోర్ట్ లో విచారణ చేయించమని కోరాడు. ఢీల్లీ కోర్ట్ లో అయితే చాలామంది విమర్శకులకు ఇబ్బందులు తప్పవు. అలాగే ఆయన విమర్శకుల సోషల్ మీడియా అకౌంట్స్ పై కూడా విచారణ చేయించబడుతారు. అందుకోసం వాళ్లంతా కూడా ముందుగానే జాగ్రత్తలు చర్యలు తీసుకోబోతున్నారు. మరో విషయం ఏంటంటే.. ఇతర హీరోల ఫ్యాన్సే ఎక్కువగా ఇబ్బందులు క్రియేట్ చేయబోతున్నారు. ఎంత అభిమానం కూడా ఒక దశ దాటితే ఇబ్బందులు తప్పదు అని హెచ్చరించినట్టుగా కూడా ఈ కేస్ విషయంలో అర్థం అవుతుంది. ఆ గొడవ మాత్రం అంత సులువుగా మాత్రం ఎన్టీఆర్ వదిలివేస్తాడు అనుకోవడం లేదు. గతంలో, ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై నాగార్జున ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు.