NTR : ఫాల్కే లుక్ లో ఎన్టీఆర్.. లుక్ అదిరిపోయిందిగా

Update: 2025-05-16 11:30 GMT

భారతీయ చలన చిత్ర దిగ్గజం దాదా సాహెబ్ ఫాల్కే పాత్రంలో ఎన్టీఆర్ కనిపించబో తున్నాడు. దీనిపై బాలీవుడ్ మీడియాలో ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. రెండేళ్ల క్రితం దర్శక ధీరుడు రాజమౌళి సమర్పణలో ఫాల్కే జీవిత కథ ఆధారంగా 'మేడ్ ఇన్ ఇండియా' పేరుతో నిర్మించనున్నట్టు ప్రకటించారు. సినిమా ఈ మూవీని ఆయన తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్నారు. భారతీయ సినిమా గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నా రట. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదాసా హెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా దీన్ని రూపొం దించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రా జెక్ట్కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా బాలీవుడ్ మీడియా పేర్కొంది. “స్క్రిప్ట్ విని ఆశ్చర్యపోయారు. ఈ కథ భారతీయ సినిమా పుట్టుక.. అది ఎదిగిన తీరును ప్రపంచానికి చూపనుంది. ఈ పాత్రలో నటించడానికి ఎన్టీఆ ర్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. టీమ్ మొత్తం దీనిపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనిపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఫైనల్ స్క్రిప్ట్ కూడా లాక్ అయింది” అని సమాచారం. ఎన్టీ ఆర్ను దాదా సాహేబ్ ఫాల్కే లుక్లో ఏఐతో రూపొందించి సోషల్ మీడియాలో అభిమా నులు షేర్ చేస్తున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే గెటప్లో ఖాదీ కుర్తా, మీసాలు, గడ్డంతో ఉన్న ఎన్టీఆర్ లుక్స్ కు విశేష స్పందన లభిస్తోంది. ఈ లుక్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

Tags:    

Similar News