మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హ్యాండ్ ఇవ్వబోతున్నాడా..? అనేదే ఇప్పుడు చాలామందిలో వినిపిస్తోన్న ప్రశ్న. అతని వర్కింగ్ స్టైల్ గురించి తెలిసిన వాళ్లంతా ఆ ప్రశ్నలో నిజం లేదు అనిపిస్తోంది. కానీ అతని వర్క్ ఇప్పుడు ఎలా ఉండబోతోంది అనేది తెలిసిన వాళ్లంతా ఈ మాట నిజమే అనిపించక మానదు. ఇంతకీ అతని ఏ మూవీ గురించి మాట్లాడేది అనిపిస్తోందా..? దేవర. యస్.. దేవర మూవీ విషయంలో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ చాలానే వస్తున్నాయి అనుకుంటున్నారు. అందుకు కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్, నెల్సన్ దిలీప్ కుమార్ మూవీస్.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ మూవీ కోసం ఆయన చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తున్నాడు. ఈ మూవీ జూన్ 25న విడుదల చేస్తాం అని కూడా ప్రకటించారు. ఆ తర్వాత వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతోంది. అది కూడా ఓ పౌరాణిక చిత్రం అని ముందు నుంచీ వినిపిస్తోంది. అంటే ఈ మూవీ గెటప్ తో పాటు యాటిట్యూడ్ కోసం మరే ప్రాజెక్ట్ పై కూడా వర్క్ చేయడం కుదరదు. ఆపై తమిళ్ దర్శకుడు నెల్సన్ కుమార్ తోనే మూవీ ఉండబోతోంది. ఆ రెండిట మధ్య కొరటాల శివతో దేవర 2 చేయడం కుదురుతుందా అంటే మాత్రం అసాధ్యమే అని చెబుతున్నారు. అందుకే కొరటాల శివతో మరో సినిమా చేయమని సలహా ఇచ్చాడట ఎన్టీఆర్. ఆ తర్వాత కుదిరితే మాత్రం ఎన్టీఆర్ దేవర 2 కు చేయడం చేయొచ్చు అనే భావిస్తున్నారు. బట్ అప్పటికే మూవీస్ విషయంలో చాలా మార్పులు వస్తాయి కాబట్టి దేవర 2 ను సైడ్ చేసినట్టే అని తెలుస్తోంది. ఇప్పటికైతే కొరటాల శివతో మాత్రం మరో మూవీ చేయమనే మాత్రం చెప్పాడట. అంటే దేవర2 కు ఎన్టీఆర్ హ్యాండ్ ఇచ్చినట్టే కదా అర్థం అనుకుంటున్నారు.