మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న డ్రాగన్ పై భారీ అంచనాలున్నాయి. కేజీఎఫ్, సలార్ వంటి ఎపిక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత ప్రశాంత్ చేస్తున్న సినిమా కావడం.. ఇటు ఆర్ఆర్ఆర్, దేవర వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత ఎన్టీఆర్ చేస్తోన్న మూవీ కావడంతో ఈ అంచనాలు పీక్స్ లో కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 జనవరి 9న విడుదల చేసేలా ప్లాన్ చేస్తోన్న ఈ మూవీ షూటింగ్ కొన్నాళ్ల క్రితమే ప్రారంభం అయింది. నిజానికి లాస్ట్ ఇయరే స్టార్ట్ అవుతుందన్నారు. కానీ ఎన్టీఆర్ వార్ 2 చిత్రీకరణ ఆలస్యం కావడం వల్ల ఈ ప్రాజెక్ట్ కూడా లేట్ అయింది. అందుకే రిలీజ్ డేట్ లో మార్పులు ఉంటాయోమో అనుకున్నారు. కాకపోతే అలాంటివేం లేవని ప్రశాంత్ నీల్ గట్టిగానే చెబుతున్నాడు.
ఇక కొన్ని రోజుల క్రితం బెంగళూరు షెడ్యూల్ తో సెట్స్ లోకి అడుగుపెట్టాడు ఎన్టీఆర్. 1960ల కాలంలో పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ మేకోవర్ కూడా రగ్ డ్ గా కనిపించబోతోంది. మాస్ ఆడియన్స్ ను మెప్పించడంలో ప్రశాంత్ నీల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో తెలుసు కదా. అందుకే ఈ చిత్రంలోనూ ఆ డోస్ గట్టిగానే ఉండబోతోందట. ఇక త్వరలోనే మరో షెడ్యూల్ ప్రారంభం కాబోతోన్న ఈ మూవీ సెట్స్ లోకి ఎన్టీఆర్ ఈ నెల 22 నుంచి అడుగపెట్టబోతున్నాడట. ఇంత ఈజీగా చెబితే ఇది వార్త ఎందుకు అవుతుంది.. అందుకే వాళ్లు ఇచ్చిన అప్డేట్ చూస్తే.. ‘ఒక విధ్వంసకర మట్టిలోకి ఈ నెల 22 నుంచి అడుగుపెట్టబోతున్నాడు డ్రాగన్’ అని చెప్పారు. మరి ఆ విధ్వంసం ఈయన చేస్తాడా ఆపుతాడా అనేది తర్వాతి మేటర్ కానీ.. ఇంత ఎండల్లో కూడా వీళ్లు చేస్తోన్న హార్డ్ వర్క్ చూసే బాక్సాఫీస్ లు భయపడతాయేమో కదా..?