యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుటుంబం కోనసీమలో ఓ వివాహ వేడుకకు హాజరై సందడి చేసింది. కాకపోతే ఈ పెళ్లికి ఎన్టీఆర్ రాలేదు. కళ్యాణ్ రామ్ తో పాటు ఎన్టీఆర్ భార్య, ఆయన తల్లిగారు హాజరయ్యారు. ఇంత పెద్ద స్టార్ ఫ్యామిలీ పెళ్లికి రావడంతో ఆ వివాహ వేడుక అంతా అత్యంత ఉత్సాహంగా కనిపించింది.
తను రాకున్నా.. తల్లిని, భార్యను పంపించాడు అంటే ఆ వ్యక్తులు ఎంత ఇంపార్టెంట్ వారో అర్థం చేసుకోవచ్చు. ఈ పెళ్లి నందమూరి వారి ఆస్థాన సిద్ధాంతి కారుపర్తి కోటేశ్వరరావు కుమార్తెది. ఆస్థాన సిద్ధాంతి అంటే ఎవరికైనా అత్యంత గౌరవం ఉంటుంది కదా. వారింట పెళ్లి అంటే అంతే ప్రాధాన్యం ఇస్తారు. అందుకే తన అన్నతో పాటు కుటుంబాన్ని పంపించాడు ఎన్టీఆర్.
ప్రస్తుతం ఎన్టీఆర్.. హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీకి సంబంధించి ఓ పాట చిత్రీకరణలో ఉన్నాడు. అందుకే రాలేకపోయాడు.