Streaming on Aha : ఆహాలో 'ఒక యముడి ప్రేమకథ'

Update: 2025-06-05 12:45 GMT

సీతారామం, కల్కి, లక్కీ భాస్కర్ తదితర హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం దుల్కర్, రాణా దగ్గుబాటి స్పిరిట్ మీడియా నిర్మిస్తున్న 'కాంతా', స్వప్న సినిమాస్ నిర్మాణంలో రూపొందుతున్న 'ఆకాశంలో ఒక తారా' అనే రెండు తెలుగు ప్రా జెక్టుల్లో నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఆహా ఓటీటీ సంస్థ దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళ బ్లాక్బస్టర్ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. కామోడి థ్రిలర్గా తెరకెక్కి అభిమానుల మన్ననలు పొందిన 'ఒరు యమండన్ ప్రేమకథ' చిత్రం 'ఒక యముడి ప్రేమకథ' పేరుతో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను తెలుగులో భవాని మీడియా విడుదల చేయనుండగా, దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా స్టార్గా ఎదుగుతున్న ప్రయాణంలో ఇది మరొక మైలురాయి. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్.

Tags:    

Similar News