మాస్ మహరాజ్, శ్రీలీల జంటగా నటించిన సినిమా మాస్ జాతర. మనదే ఇదంతా అనేది క్యాప్షన్. భాను భోగవరపు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయబోతున్నారు. తాజాగా మాస్ జాతర నుంచి మరో ఊరమాస్ సాంగ్ ను విడుదల చేశారు. భీమ్స సిసిరోలియో మ్యూజిక్ అందిస్తోన్న ఈ మూవీలోని ఈ పాటను కూడా తనే పాడాడు. రవితేజ ఇమేజ్ కు తగ్గట్టుగా భాస్కర్ యాదవ్ సాహిత్యం కనిపిస్తోంది. కాకపోతే పదాలు కాస్త డోస్ పెరిగాయేమో అని కూడా అనిపిస్తుంది.
‘ఓలే ఓలే గుంటా.. నీ అయ్యకాడ ఉంటా నీ అమ్మకాడ తింటా నీ ఒల్లోకొచ్చి పంటా... బుద్ధి లేదు, జ్ఞానం లేదు సిగ్గు లేదు శరమూ లేదు.. మంచి లేదు మర్యాద లేదూ.. అంగీ లేదు లాగు లేదు.. లుంగీ లేదు పంచె లేదు.. తాడు లేదు బొంగరమూ లేదు.. ’ అంటూ మొదలైన పాటలో నీ అమ్మని, నీ అక్కని, నీ చెల్లిని పట్టుకుని అంటూ సాగిన పదాల ఎండింగ్ బెటర్ గా ఉంది. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. అతని శైలికి, రవితేజ స్టైల్ కు తగ్గట్టుగా మంచి హుషారైన స్టెప్పులే ఉన్నాయి. కాకపోతే గుంటూరు కారం నుంచి శ్రీలీలకు ఇలాంటి మాస్ నంబర్స్ లో ఒకే రకం కాస్ట్యూమ్ కనిపిస్తోంది. దీంతో మొనాటనీగా కనిపిస్తోంది తను. పైగా ఎక్కువగా అవే ఎక్స్ ప్రెషన్స్ కూడా రిపీట్ అవుతున్నాయి. మొత్తంగా ఆ సందర్భానికి తగ్గట్టుగా సాగే ఓ హుషారైన ఊరమాస్ ఫిల్లింగ్ సాంగ్ లా ఉంది ఇది.