Omicron Variant: పాన్ ఇండియా సినిమాలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్.. విడుదలలు వాయిదా పడాల్సిందేనా..?

Omicron Variant: మళ్లీ థియేటర్లలో ఆంక్షలు మొదలవుతాయా? అన్న అనుమానాలు ప్రజలను వెంటాడుతున్నాయి.

Update: 2021-12-03 10:51 GMT

Omicron Variant: ఇండియాలోకి ఒమిక్రాన్ వైరస్ ఎంటర్ అయిపోయింది. ఇది డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తుందని, దీనితో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే డబ్యూహెచ్‌ఓ ప్రకటించింది. దీంతో మరోసారి దేశ ప్రజల్లో కరోనా భయం మొదలయ్యింది. పలుచోట్ల స్కూళ్లు, కాలేజీలు తెరవడం వల్ల కూడా కరోనా వేగంగా వ్యాపించడం మొదలయ్యింది. అయితే ఇది సినిమాల వరకు వస్తుందా..? మళ్లీ థియేటర్లలో ఆంక్షలు మొదలవుతాయా? అన్న అనుమానాలు ప్రజలను వెంటాడుతున్నాయి.

కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ వల్ల ఎన్నో సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. దీంతో విడుదలలు ఆలస్యమయ్యాయి. చాలాకాలం తర్వాత ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ నుండి మొదలయ్యే పాన్ ఇండియా సినిమాల సందడి సమ్మర్ వరకు కొనసాగనుంది. అందుకే ప్రస్తుతం మూవీ లవర్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. కానీ ఆ ఖుషీకి బ్రేక్ పడుతుందేమో అని చాలామంది భయపడుతున్నారు కూడా.

ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ వల్ల థియేటర్లలో ఆంక్షలు విధిస్తే ఎలా అంటూ పాన్ ఇండియా సినిమాల నిర్మాతలు భయపడుతున్నారు. పాన్ ఇండియా సినిమాలకు లాభాలు రావాలంటే వాటి విడుదల సమయంలో థియేటర్లలో ఎలాంటి ఆంక్షలు ఉండకూడదు.. అంతే కాక ఆ సినిమా థియేటర్ రన్ కూడా ఎక్కువకాలం ఉండాలి. ఈ విషయంపై భయాందోళనకు గురవుతున్న సినీ నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చారు.

ఒకవేళ సినిమాలు విడుదలయ్యే సమయానికి ఒమిక్రాన్ వ్యాప్తి మామూలుగా ఉన్నా.. లేదా థియేటర్లలో ఆంక్షలు విధించకుండా ఉంటే ఆర్ఆర్ఆర్, పుష్ప, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ లాంటి సినిమాలు అనుకున్న తేదీలకే విడుదలవుతాయి. ఒకవేళ అలా జరగకపోతే తేదీలు మార్చాలనే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. ముందుగానే ప్రిపేర్ అయ్యింటే మునుపటి లాగా సినిమాల విడుదల విషయంలో గందరగోళం జరగదని వారు భావిస్తున్నారట.

Tags:    

Similar News