మిల్కీ బ్యూటీ తమన్నా చాలాకాలం తర్వాత తెలుగులో చేసిన చిత్రమే 'ఓదెల 2'. సంపత్ నంది అందించిన కథతో వస్తున్న ఈ క్రేజీ డివోషనల్ థ్రిల్లర్ చిత్రం ఈ మధ్య టీజర్ తో మంచి బజ్ ని అందుకుంది. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తవ్వగా, తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 17న ఓదెల 2 రిలీజ్ అంటూ, తమన్న పవర్ ఫుల్ పోస్టర్ తో అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ నెల ఆఖరిలో ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తోందట చిత్రబృందం. ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహించగా తెలుగు సహా పాన్ ఇండియా భాషల్లో దీనిని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి కాంతార, విరూపాక్ష, మంగళవారం సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ మ్యూజిక్అందించగా మధు క్రియేషన్స్ అలాగే సంపత్ నంది టీం వర్క్ వారు నిర్మాణం వహించారు. ఓదెల 2 చిత్రానికి ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల ధర ఇప్పటికే జరిగిందనే సమాచారం బయటికి వచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సుమారు రూ.11కోట్ల ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. అయితే, ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్ హక్కులను తీసుకుందో సమాచారం వెల్లడికాలేదు. త్వరలో ఈ విషయం కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది.