Oscar 2023 : RRR టీమ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు : బాలకృష్ణ

Update: 2023-03-13 06:36 GMT

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని గెలుపొందిన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు హీరో నందమూరి బాలకృష్ణ. ఇందుకుగాను ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

" ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడం భారతీయ సినీ చరిత్రలో అపూర్వ ఘట్టం. తెలుగు జాతితో పాటు దేశం గర్వించదగిన విజయమిది. స్వరకర్త కీరవాణి గారికి, గీత రచయిత చంద్రబోస్ గారికి ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు. అలాగే డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్స్ కేటగిరీలో ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న భారతీయ చిత్రం ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్ర బృందానికి నా అభినందనలు" అని తెలియజేశారు నందమూరి బాలకృష్ణ.



Similar News