P Susheela: ఘనంగా సుశీలమ్మ మనవరాలి నిశ్చితార్థం..
P Susheela: సుశీలమ్మకు ఒక్కడే కుమారుడు. అతడే జయకృష్ణ. తన భార్య పేరు సంధ్య.;
P Susheela: తెలుగు సినీ పరిశ్రమ మాత్రమే కాదు.. మొత్తం మ్యూజిక్ ఇండస్ట్రీ మర్చిపోలేని ఓ సింగర్ పి సుశీల. ఆమె అభిమానులు ఆమెను ముద్దుగా సుశీలమ్మ అని పిలుచుకుంటారు. అయితే అలాంటి సుశీలమ్మ తన మనవరాలి నిశ్చితార్థం ఘనంగా చేశారు. తన కొడుకు కూతురి నిశ్చితార్థం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది.
సుశీలమ్మకు ఒక్కడే కుమారుడు. అతడే జయకృష్ణ. తన భార్య పేరు సంధ్య. వీరు, తమ పిల్లలతో కలిసి హైదరాబాద్ గచ్చిబౌళిలో నివాసముంటున్నారు. వారి కుమార్తె శుభశ్రీకి ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీరామ్ కుమారుడు వినీత్‌తో నిశ్చితార్థం జరిగింది. శంషాబాద్‌లోని సియారా రిట్రీట్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్‌లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.