PALAK MUCHHAL : పాటలతో ప్రాణం పోసే పాలక్ ముచ్చల్

గానంతో 3,800 మంది చిన్నారులకు పునర్జన్మ... దాతృత్వంతో పాలక్ ముచ్చల్ రికార్డు!.. గతంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్.. ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్

Update: 2025-11-13 05:30 GMT

సి­ని­మా­లే కాదు సమా­జ­సే­వ­లో­నూ పాలు పం­చు­కుం­టో­న్న హీ­రో­లు, హీ­రో­యి­న్లు చాలా మందే ఉన్నా­రు మన ఇం­డ­స్ట్రీ­లో. టా­లీ­వు­డ్, బా­లీ­వు­డ్, కో­లీ­వు­డ్, శాం­డ­ల్ వుడ్, మా­లీ­వు­డ్.. ఇలా అన్ని ఇం­డ­స్ట్రీ­లో­ని నటు­లు తమ సం­పా­ద­న­లో కొంత భా­గా­న్ని సా­మా­జిక సే­వ­కు ఉప­యో­గి­స్తు­న్నా­రు. కొం­ద­రు అనా­థా­శ్ర­మా­లు, వృ­ద్ధా­శ్ర­మా­లు ఏర్పా­టు­చే­స్తు­న్నా­రు. మరి­కొం­ద­రు పేద పి­ల్ల­ల­ను ఉచి­తం­గా చది­వి­పి­స్తు­న్నా­రు. ఇం­కొం­ద­రు బ్ల­డ్ బ్యాం­కు­లు, ఐ బ్యాం­కు­లు ఏర్పా­టు చే­స్తు­న్నా­రు. ఇప్పు­డు మనం మా­ట్లా­డు­కో­బో­యే స్టా­ర్ సిం­గ­ర్ కూడా సరి­గ్గా ఇదే కో­వ­కు చెం­దు­తుం­ది. తన తీ­య­నైన పా­ట­ల­తో సం­గీ­తా­భి­మా­ను­ల­ను ఉర్రూ­త­లూ­గిం­చే ఆమె తన సేవా గు­ణం­తో­నూ ఎం­ద­రి­కో ఆద­ర్శం­గా ని­లు­స్తోం­ది. తన ఛా­రి­ట­బు­ల్ ఫౌం­డే­ష­న్ ద్వా­రా ఎంతో మంది పేద చి­న్నా­రు­ల­కు ఉచి­తం­గా గుం­డె ఆప­రే­ష­న్లు చే­స్తోం­ది. తద్వా­రా వారి తల్లి­దం­డ్రుల కళ్ల­ల్లో ఆనం­దా­న్ని నిం­పు­తుం­ది. అలా ఇప్ప­టి­వ­ర­కు సు­మా­రు 3800 మంది పి­ల్ల­ల­కు ప్రా­ణం పో­సిం­దీ స్టా­ర్ సిం­గ­ర్. తన సా­మా­జిక సేవా కా­ర్య­క్ర­మా­ల­తో ఇప్ప­టి­కే లి­మ్కా బుక్ ఆఫ్ రి­కా­ర్డ్స్‌­లో చోటు దక్కిం­చు­కు­న్న ఆమె తా­జా­గా మరో ఘన­త­ను సొం­తం చే­సు­కుం­ది. ఏకం­గా గి­న్ని­స్‌ బు­క్‌ ఆఫ్ వర­ల్డ్ రి­కా­ర్డ్స్ లోనూ తన పే­రు­ను లి­ఖిం­చు­కుం­ది.

పా­ల­క్ ము­చ్చ­ల్‌.. తె­లు­గు ఆడి­యె­న్స్ కు పె­ద్ద­గా ఈ పేరు తె­లి­య­క­పో­వ­చ్చు.. కానీ హిం­దీ సి­ని­మా­లు చూసే వారు మా­త్రం ఇట్టే గు­ర్తు పడ­తా­రు. ‘మేరీ ఆషి­కి’, ‘కౌన్ తుఝే’, ‘ప్రే­మ్ రతన్ ధన్ పాయో’ వంటి పా­ట­ల­తో మంచి గు­ర్తిం­పు తె­చ్చు­కుం­దీ బ్యూ­టి­ఫు­ల్ సిం­గ­ర్. అయి­తే తన పాటల కంటే తన సా­మా­జిక సేవా కా­ర్య­క్ర­మా­ల­తో­నే బాగా ఫే­మ­స్ అయ్యిం­ది పా­ల­క్. ఇప్ప­టి వరకు సు­మా­రు 3,800 మం­ది­కి పైగా పేద పి­ల్ల­ల­కు ఉచి­తం­గా గుం­డె ఆప­రే­ష­న్లు చే­యిం­చిం­ది. గతం­లో కా­ర్గి­ల్ అమ­ర­వీ­రుల కు­టుం­బా­ల­కు లక్షల రూ­పా­య­లు వి­రా­ళ­మి­చ్చిన పా­ల­క్ ము­చ్చ­ల్ గు­జ­రా­త్ భూ­కంప బా­ధి­తుల కోసం రూ. 10 లక్ష­లు వి­రా­ళం­గా ఇచ్చిం­ది.


గానంతో ప్రాణదానం..

1992, మా­ర్చి 30న మధ్య­ప్ర­దే­శ్‌­లో­ని ఇం­డో­ర్‌­లో పు­ట్టిన పా­ల­క్ ము­చ్చ­ల్, తన నా­లు­గో ఏట నుం­చే పా­డ­డం మొ­ద­లె­ట్టిం­ది. పా­ల­క్, ఆమె అన్న పలా­ష్ ము­చ్చ­ల్ ఇద్ద­రూ కలి­సి 2000, మా­ర్చి నుం­చే స్టే­జ్ షోస్ ఇవ్వ­డం మొ­ద­లు­పె­ట్టా­రు. అలా తమ షోస్ ద్వా­రా వచ్చిన మొ­త్తా­న్ని గుం­డె సం­బం­ధిత వ్యా­ధు­ల­తో బా­ధ­ప­డు­తు­న్న ని­రు­పేద చి­న్నా­రుల వై­ద్యం కోసం ఉప­యో­గిం­చే­వా­రు. ఇప్ప­టి­కే ఆమె చే­స్తు­న్న సే­వ­ను ప్ర­భు­త్వం గు­ర్తిం­చి, పలు అవా­ర్డు­ల­ను కూడా ఇచ్చిం­ది. పా­ల­క్ ఫౌం­డే­ష­న్ ద్వా­రా వచ్చిన మొ­త్తం­తో పాటు సిం­గ­ర్‌­గా ఆమె సం­పా­దిం­చిన మొ­త్తా­న్ని కూడా పి­ల్లల హా­ర్ట్ సర్జ­రీ­ల­కు ఉప­యో­గిం­చ­డం మొ­ద­లె­ట్టిం­ది పా­ల­క్ ము­చ్చ­ల్.. చి­న్న­త­నం­లో వీ­ధి­వీ­ధి తి­రు­గు­తూ పా­ట­లు పా­డు­తూ చం­దా­లు వసూ­లు చేసి, ఆ మొ­త్తా­న్ని కా­ర్గి­ల్ యు­ద్ధ వీ­రుల కోసం వి­రా­ళం ఇచ్చిం­ది పా­ల­క్ ము­చ్చ­ల్.. అలా­గే గు­జ­రా­త్ భూ­కం­పం సమ­యం­లో రూ.10 లక్షల వి­రా­ళం ఇచ్చిం­ది. 2013లోనే ఆమె రూ.2.5 కో­ట్లు సే­క­రిం­చి, వా­టి­ని 572 మంది పి­ల్ల­ల­కు గుం­డె ఆప­రే­ష­న్ల­ను ని­ర్వ­హిం­చ­డా­ని­కి ఉప­యో­గిం­చి­న­ట్టు­గా NDTV రా­సు­కొ­చ్చిం­ది. ఇలా 25 ఏళ్లు­గా దాతల నుం­చి సే­క­రిం­చిన మొ­త్తం­తో 3800 హా­ర్ట్ సర్జ­రీ­ల­ను చే­యిం­చి, లి­మ్కా బుక్ ఆఫ్ రి­కా­ర్డ్స్‌­లో స్థా­నం దక్కిం­చు­కుం­ది. ఇప్పు­డు గి­న్నీ­స్ వర­ల్డ్ రి­కా­ర్డు­ల్లో­నూ పా­ల­క్ ము­చ్చ­ల్‌­కి చోటు దక్కిం­ది.

డబ్బు­లు లేక ఏ ఒక్క పసి గుం­డె ఆగ­కూ­డ­ద­నే­ది నా సం­క­ల్పం. దాతల నుం­చి ఎంత వీ­లై­తే అంత వి­రా­ళం స్వీ­క­రి­స్తాం. రూ.100 ఇచ్చే­వా­ళ్లు కూడా ఉన్నా­రు. ఆ మొ­త్తం కూడా కొ­న్ని­సా­ర్లు ఎంతో ఉప­యో­గ­ప­డొ­చ్చు. అత్య­వ­సర చి­కి­త్స­ల­కు మొ­ద­టి ప్రా­ధా­న్యం ఇస్తాం.. స్టే­జ్ షోస్ ని­ర్వ­హిం­చ­లే­న­ప్పు­డు నేను దా­చు­కు­న్న డబ్బు­ల­ను కూడా వా­డే­స్తా­ను.. అవీ కూడా సరి­పో­క­పో­తే సో­ష­ల్ మీ­డి­యా ద్వా­రా దాతల నుం­చి సాయం కో­ర­తా­ను.. మనకి కా­వా­ల్సిం­ది ఓ ప్రా­ణం ని­ల­వ­డ­మే!’ అంటూ చె­ప్పు­కొ­చ్చిం­ది పా­ల­క్ ము­చ్చ­ల్.

Tags:    

Similar News