Boyapati_Ram : రామ్ కోసం బాలీవుడ్ టాప్ హీరోయిన్.. బోయపాటి భారీ ప్లాన్..!
Boyapati_Ram : టాలీవుడ్ ఎనర్జీటిక్ హీరో రామ్, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..;
Boyapati_Ram : టాలీవుడ్ ఎనర్జీటిక్ హీరో రామ్, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇది బోయపాటికి పదో సినిమా కాగా, రామ్‌కి 20వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాను శ్రీనివాస్ చుట్టూరి నిర్మిస్తుండగా తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ పరిణితీ చోప్రా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో కథాచర్చలు జరగగా, ఆమె కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.
ఇందులో మరో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉందని సమాచారం. సౌత్ నుంచి మరో టాప్ హీరోయిన్‌ని తీసుకోనున్నారట. గతేడాది బాలయ్యతో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బోయపాటి.. ఇప్పుడు యంగ్ హీరో రామ్‌తో సినిమా చేస్తుండడంతో సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ఇందులో మీరాజాస్మిన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా సమాచారం. కాగా అటు రామ్ ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్‌లో వారియర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత రామ్, బోయపాటి మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.