Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు ట్రైలర్ డేట్ ఫిక్స్ అయింది

Update: 2025-06-30 07:47 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ కు ముహూర్తం సెట్ అయింది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ అసలు ఉంటుందా లేదా అనే దశ నుంచి ఫైనల్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే అనే రిలీజ్ డేట్స్ మార్చుకున్న ఈ మూవీ ఫైనల్ గా జూలై 24న విడుదల కాబోతోంది. ఈ సారి రిలీజ్ డేట్ లో ఏ మార్పులూ ఉండకపోవచ్చు. క్రిష్ ప్రాజెక్ట్ లేట్ అవుతుందని మధ్యలోనే వదిలేశాడు. ఆ మిగిలిన భాగాన్ని నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశాడు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. 17వ శతాబ్దం నాటి కథాంశంతో వస్తోన్న ఈ చిత్రం ఔరంగజేబ్ రాజ్యంలో సాగే కథగా ఉండబోతోంది. ఆ పాత్రలో బాబీ డియోలో కనిపించబోతున్నాడు. అనసూయ, పూజిత పొన్నాడ ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు.

ఇక ఈ మూవీ ట్రైలర్ కు డేట్ ఫిక్స్ అయింది. రీసెంట్ గా చేసిన ట్రైలర్ ను పవన్ కళ్యాణ్ చూశాడట. చాలా బావుంది అని చెప్పడంతో ట్రైలర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. జూలై 3న హరిహర వీరమల్లు ట్రైలర్ విడుదల కాబోతోంది. ఈ మూవీ నుంచి అదే రోజు ఓ ఈవెంట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. మరి ట్రైలర్ రిలీజ్ కు పవన్ కళ్యాణ్ వస్తాడా లేదా అనేది చెప్పలేం కానీ.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మాత్రం ఖచ్చితంగా అటెండ్ అయ్యే అవకాశాలున్నాయి. సో.. ఇక ప్రమోషన్స్ కూడా వచ్చే వారం నుంచి మొదలవుతాయని చెప్పొచ్చు. మొత్తంగా హరిహర వీరమల్లుకు మోక్షం వచ్చినట్టే. 

Tags:    

Similar News