Pawan Kalyan: పవన్ మేనియా మాములుగా లేదుగా.. 'తమ్ముడు' మళ్లీ వచ్చినా..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. ఆ పేరులోనే ఏదో ఎనర్జీ ఉంది. అందుకే అభిమానులను అంతగా అట్రాక్ట్ చేస్తుంది.

Update: 2022-09-01 07:55 GMT

Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. ఆ పేరులోనే ఏదో ఎనర్జీ ఉంది. అందుకే అభిమానులను అంతగా అట్రాక్ట్ చేస్తుంది. తమ్ముడు విడుదలై దాదాపు ఇరవై ఏళ్లు దాటింది. అప్పట్లో అది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయినా ఇప్పుడు సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ సినిమాను థియేటర్లలో మరోసారి విడుదల చేసింది చిత్ర యూనిట్. కొత్త సినిమా రిలీజ్ అయినట్టుగా జనం థియేటర్ల ముందు ఉన్నారంటే పవన్‌కు ఉన్న క్రేజ్ ఏమిటో అర్థం అవుతోంది.

భాగ్యనగరంలోని ప్రసాద్ ఐమ్యాక్స్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే ఆయా థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. సినిమా హాళ్ల ముందు భారీ కటౌట్లు ఏర్పాటు చేసి జై పవన్ కళ్యాణ్ అని నినాదాలు చేస్తూ, డ్యాన్సులు చేస్తున్నారు. థియేటర్ల లోపల కూడా ఇలాంటి వాతావరణమే కనిపించింది. పవన్ ఎంట్రీ సీన్స్, మేడిన్ ఆంధ్రా సాంగ్‌, ఫైటింగ్ సీన్స్‌కు ఫ్యాన్స్ సీట్లలోనుంచి లేచి డ్యాన్సులు చేశారు.

పవన్ కళ్యాణ్ మరో సూపర్ హిట్ చిత్రం జల్సాని కూడా సెప్టెంబర్ 1న రిలీజ్ చేసింది. ఈ ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 501 థియేటర్లలో జల్సాను విడుదల చేస్తున్నారు. దీంతో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి. రీ రిలీజ్ చిత్రానికి ఇన్ని షోలు వేయడం, ప్రేక్షకుల నుంచి ఇంత అద్భుతమైన స్పందన రావడం మునుపెన్నడూ చూడలేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. 


Tags:    

Similar News