Pawan Kalyan : కోలుకుంటోన్న పవన్ కళ్యాణ్ కొడుకు

Update: 2025-04-09 12:15 GMT

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎమ్ పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ నిన్న సింగపూర్ లోని ఓ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. మొదట తను కూడా చిన్న గాయాలే అనుకున్నానని.. కానీ తర్వాత అవి పెద్దవే అని తెలిసిందని మీడియాకు వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు పవన్. వెంటనే అతను సింగపూర్ బయలుదేరి వెళ్లాడు. అటు మెగాస్టార్ చిరంజీవి కూడా సతీ సమేతంగా సింగపూర్ వెళ్లిపోయాడు.

మార్క్ శంకర్ ప్రస్తుతం సింగపూర్ లో సమ్మర్ క్యాంప్ లో ప్రత్యేకమైన పాఠాలు నేర్చుకుంటున్నాడు. అతను చదివి పాఠశాలలోనే అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం అక్కడ కన్ స్ట్రక్షన్ వర్క్ జరుగుతోందట. అందుకే మంటలు పెద్దగా వ్యాపించలేదు అంటున్నారు. అయినా సరే ఒక పాప చనిపోయింది. మార్క్ శంకర్ చేతులకు కాలిన గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. వెంటనే చికిత్స ప్రారంభించడంతో ఆ పసివాడికి ప్రాబ్లమ్ ఏం లేదు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. తాజాగా విడుదల చేసిన ఫోటో చూస్తే మార్క్ శంకర్ కూడా ధైర్యంగానే కనిపిస్తున్నాడని చెప్పాలి.

 

Tags:    

Similar News