Pawan Kalyan : భీమ్లానాయక్ సక్సెస్.. టీమ్‌కి పెద్ద పార్టీ ఇచ్చిన పవన్
Pawan Kalyan : సహజంగా ఓ సినిమాని కంప్లీట్ చేశాక ఆ సినిమాకి దూరంగా ఉండే పవన్.. భీమ్లానాయక్ సక్సెస్‌ని మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడు.
Pawan Kalyan : భీమ్లానాయక్ సక్సెస్‌తో ఫుల్ ఖుషిలో ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సహజంగా ఓ సినిమాని కంప్లీట్ చేశాక ఆ సినిమాకి దూరంగా ఉండే పవన్.. భీమ్లానాయక్ సక్సెస్‌ని మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడు. సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ చూసి పవన్ హ్యాపీగా ఉన్నాడట.. అందుకే ఈ సినిమా సక్సెస్‌ని టీమ్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఫిలింనగర్‌లో చిత్రయూనిట్‌కి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చాడట పవన్.. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి రానా హీరోలుగా వచ్చిన ఈ మల్టీస్టారర్ మూవీకి దర్శకుడు త్రివిక్రమ్ కథనం, మాటలు అందించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మించగా, థమన్ ఎస్ సంగీతం అందించారు.
నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. భీమ్లానాయక్ సినిమా తొలిరోజు నైజాం ఏరియాలో ఏకంగా రూ.11.80 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డు నెలకొల్పింది.
నడిచొచ్చే నర్తన శౌరి, 😘 పరిగెత్తే పరాక్రమ శైలి 🤗 #pawankalyan Annaya Success Meet yesterday Night 💥🔥🥳💐🤟Then #GabbarSingh 👍
— Sabbisetty Karthik (@SabbisettyK) February 27, 2022
Now #BheemlaNayak 👌
Interesting thing is Both are Remakes....💥👌🍾💐#BlockBusterBheemlaNayak pic.twitter.com/nUyGtXRK3q